సైరా కంటే ఎన్టీఆర్ బిజినెస్ బావుందే..

By Prashanth MFirst Published Jan 3, 2019, 3:55 PM IST
Highlights

మెగా స్టార్ చిరంజీవి - నందమూరి బాలకృష్ణల సినిమాలంటే ఒకప్పుడు పోటాపోటీగా కలెక్షన్స్ సాదించేవి. అయితే కాలం మారుతున్న కొద్దీ మెగాస్టార్ తన బిజినెస్ పెంచుకుంటూ వెళ్లారు. ఇక బాలయ్య పరవాలేధనిపించే విధంగా తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు.

అయితే చాలా కాలం తరువాత బాలకృష్ణ విడుదలకు ముందే తన సినిమాతో భారీగా లాభాలను అందుకుంటున్నాడు. మెగాస్టార్ మార్కెట్ ను మించి బాలకృష్ణ డామినేట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ సైరా చిత్రం దాదాపు 170 కోట్లతో తెరకెక్కుతోంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ కి గట్టిగా 65 కోట్లు కూడా ఖర్చవ్వలేదు.

కానీ సైరా కంటే శాటిలైట్ రైట్స్ లలో ఎన్టీఆర్ బయోపిక్ కు ధర ఎక్కువగా పలికినట్లు తెలుస్తోంది. సైరా సినిమాకు 20 కోట్ల డీల్ సెట్టవ్వగా ఎన్టీఆర్ బయోపిక్ లోని కథానాయకుడు చిత్రానికి 25 కోట్ల ఆదాయం దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్త రెండు భాగాలకు అని ఓ టాక్ కూడా వస్తోంది. 

అయితే చిత్ర యూనిట్ మాత్రం కథానాయకుడు - మహానాయకుడు చిత్రాల  శాటిలైట్ రైట్స్ ను వేరువేరు ధరలకు అమ్మెందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాకు ప్రస్తుతం ప్రమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి. సైరాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. మరి రెండిటిలో ఏ సినిమా ఏక్కువగా లాభాలను అందిస్తుందో చూడాలి. 

click me!