పోసాని డైరెక్షన్ లో రాజకీయ చిచ్చు!

Published : Jan 03, 2019, 03:05 PM IST
పోసాని డైరెక్షన్ లో రాజకీయ చిచ్చు!

సారాంశం

టాలీవుడ్ సీనియర్ రచయితల్లో ఒకరైన పోసాని కృష్ణ మురళి డైరెక్షన్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ దుర్యోధన సినిమాతో ఒక్కసారిగా తన సత్తా చాటిన ఆయన డైరెక్షన్ చేసి చాలా కాలమవుతోంది.

టాలీవుడ్ సీనియర్ రచయితల్లో ఒకరైన పోసాని కృష్ణ మురళి డైరెక్షన్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ దుర్యోధన సినిమాతో ఒక్కసారిగా తన సత్తా చాటిన ఆయన డైరెక్షన్ చేసి చాలా కాలమవుతోంది. గత కొంత కాలంగా యాక్టర్ గా కొనసాగుతూ కెరీర్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

అయితే త్వరలో పోసాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాను స్టార్ట్ చేసి ఈ ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలనీ పోసాని ప్రణాళికలు రచిస్తున్నారట. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి.   వాటిని టార్గెట్ చేస్తూ పొలిటికల్ సెటైరికల్ గా సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అప్పుడే టాక్ మొదలైంది. 

ప్రస్తుతం పోసాని వైసిపి అధినేత జగన్ తో సన్నిహితంగా ఉంటూ మద్దతు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తీయబోయే సినిమా ఏపి తెలంగాణ రెండు రాష్ట్రాల రాజకీయం నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. దీంతో పోసాని తీయబోయే సినిమా ఎలాంటి చిచ్చు రగిలిస్తుందో అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.  

PREV
click me!

Recommended Stories

నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్
Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?