ఎన్టీఆర్‌ బామ్మర్ది కొత్త సినిమా టైటిల్‌ `ఆయ్‌`.. ఫ్రెండ్స్ తో వస్తున్న నార్నే..

Published : Mar 06, 2024, 12:38 PM IST
ఎన్టీఆర్‌ బామ్మర్ది కొత్త సినిమా టైటిల్‌ `ఆయ్‌`.. ఫ్రెండ్స్ తో వస్తున్న నార్నే..

సారాంశం

ఎన్టీఆర్‌ బామ్మర్ది నితిన్‌ నార్నే ఇటీవల `మ్యాడ్‌` చిత్రంతో ఆడియెన్స్ కి పరిచయం అయ్యాడు. తాజాగా ఇప్పుడు మరో సినిమాని ప్రటించారు.   

ఎన్టీఆర్‌ బామ్మర్ది నితిన్‌ నార్నే (లక్ష్మి ప్రణతి సోదరుడు) కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది `మ్యాడ్‌` చిత్రంతో అలరించాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇందులో ముగ్గురు కుర్రాళ్లో ఒకరిగా కనిపించి మెప్పించాడు నితిన్‌ నార్నే. దీంతోపాటు మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఇంకో సినిమాని ప్రకటించారు. 

`ఆయ్‌` పేరుతో కొత్త సినిమాని ప్రకటించారు.  జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ఈ మూవీని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టైటిల్‌ ప్రకటించారు. ఇందులో పచ్చని కొబ్బరి తోటల్లో ఒక కూల్‌ మూవీలా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు పోస్టర్‌ ద్వారా తెలిపారు. ఈ సినిమాకి `మా ఫ్రెండ్స్ తో వస్తున్నామండీ` అనే క్యాప్షన్‌ ఇచ్చారు. మంచి కూల్‌ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. రేపు ఉదయం 11గంటలకు ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు.

ఇక నితిన్‌ నార్నే మొదటగా `శ్రీ శ్రీ శ్రీ రాజావారు` అనే సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఆ తర్వాత వచ్చిన `మ్యాడ్‌` విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. కానీ ఆ సినిమా పరిస్థితేంటో క్లారిటీ లేదు. ఆగిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సినిమాని ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే నితిన్ నార్నే తొలి చిత్రం `మ్యాడ్‌`లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆయన పాత్ర చాలా వరకు సైలెంట్‌గా ఉండటంతో నితిన్‌పై రాంగ్‌ ఇంప్రెషన్‌ పడింది. మరి ఈ సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. 

Read more: హీరోయిన్ల పూజల్లో మందు బాటిళ్లు.. లిక్కర్‌, నాన్‌వెజ్‌ పెడతానంటూ వేణు స్వామి కామెంట్స్.. నెట్టింట దుమారం..
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?