'మహానాయకుడు' సినిమా రెండు గంటలే..!

Published : Feb 16, 2019, 04:12 PM IST
'మహానాయకుడు' సినిమా రెండు గంటలే..!

సారాంశం

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొద్దిసేపట్లో సినిమా ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది.

ఈసారి కూడా క్లీన్ యు సర్టిఫికేట్ లభించింది. కథను ఎక్కడా బోర్ కొట్టించకుండా.. సినిమాను కట్ చేశాడు దర్శకుడు క్రిష్. ఈ సినిమా నిడివి 128 నిమిషాలు. ఎక్కడా ల్యాగ్ లేకుండా.. సినిమా క్రిస్పీగా ఉండేలా చూసుకున్నాడట.

'కథానాయకుడు' సినిమా మూడు గంటలకు దగ్గరగా నిడివి ఉంటే ఈ సినిమా మాత్రం రెండు గంటలే.. ఎమోషన్స్ బాగా క్యారీ అయ్యేలా చూసుకున్నాడని, అనవసర సన్నివేశాలను తీసేశారని అందుకేసినిమా రెండు గంటల్లోనే ముగిసిందని తెలుస్తోంది.

'కథానాయకుడు' సినిమా రిజల్ట్ క్రిష్ పై బాగానే చూపించినట్లుంది. అందుకే ఎడిటింగ్ టేబుల్ వద్ద చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కథైనా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందేమో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్
Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి