ఎన్టీఆర్‌ని ఇరకాటంలో పెట్టిన బుచ్చిబాబు.. సాహసం చేయాలా వద్దా..? తేల్చుకోలేకపోతున్న తారక్‌

Published : Apr 04, 2022, 11:17 AM IST
ఎన్టీఆర్‌ని ఇరకాటంలో పెట్టిన బుచ్చిబాబు.. సాహసం చేయాలా వద్దా..? తేల్చుకోలేకపోతున్న తారక్‌

సారాంశం

 బుచ్చిబాబు సినిమా విషయంలో ఇప్పుడు ఎన్టీఆర్‌ సందిగ్ధంలో పడ్డారట. ఆ కథ విషయంలో ఆయన చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారని, అదే సమయంలో అందులో చాలా రిస్క్ ఉందని తెలుస్తుంది. 

ఎన్టీఆర్‌(NTR) `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. వెయ్యి కోట్ల కలెక్షన్లే టార్గెట్‌గా రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్‌ తన 30వ సినిమాని కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు `ఉప్పెన` ఫేమ్‌ బుచ్చిబాబు(Buchibabu)తోనూ ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. దీనికి `పెద్ది`(Peddi) అనే టైటిల్‌ కూడా కన్ఫమ్‌ అయినట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే బుచ్చిబాబు సినిమా విషయంలో ఇప్పుడు ఎన్టీఆర్‌ సందిగ్ధంలో పడ్డారట. ఆ కథ విషయంలో ఆయన చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారని, అదే సమయంలో అందులో చాలా రిస్క్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమా 1980లో జరిగే పీరియాడికల్‌ స్పోర్ట్స్ డ్రామాగా తెలుస్తుంది. ఈ స్టోరీ తారక్‌కి బాగా నచ్చిందట. ఎలాగైనా చేయాలనే మూడ్‌లో ఉన్నారట. అందుకే కొరటాల శివ చిత్రంతోపాటు, బుచ్చిబాబు సినిమాని కూడా ఏక కాలంలో పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ జరుగుతుందని సమాచారం. 

అయితే ఈ సినిమాలో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయని తెలుస్తుంది. ఇందులో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ దివ్యాంగుడిగా కనిపించాల్సి ఉందట. ఇదే ఇప్పుడు తారక్‌ని సందిగ్దంలో పెట్టింది. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో పాన్‌ ఇండియా ఇమేజ్‌ పొందిన తారక్‌ ఇప్పుడు ఎక్స్ పర్‌మెంట్ చేస్తే ఫ్యాన్స్ రిసీవ్‌ చేసుకుంటారా? దివ్యాంగుడిగా అంగీకరిస్తారా? అనే డైలమాలో మొదలైందట. దీంతో ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారని ఫిల్మ్ నగర్‌ టాక్‌. కథలో ఆయా సన్నివేశాలు చాలా కీలకమని, వాటిని మార్చడానికి లేదని దర్శకుడి నుంచి వస్తోన్న వాదన. సో కచ్చితంగా చేయాల్సిందే. మరి ఈ రిస్క్ ని ఎన్టీఆర్‌ చేస్తారా? అనేది సస్పెన్స్ గా మారిందట. 

 `ఉప్పెన` చిత్రంలోనూ హీరోకి చివరల్లో లోపం పెట్టి హిట్‌ కొట్టారు బుచ్చిబాబు. అదే ఫార్మూలా ఎన్టీఆర్‌ సినిమాలోనూ వర్కౌట్‌ అవుతుందా? అనేది ప్రశ్నగా మారింది. వైష్ణవ్‌ తేజ్‌కి `ఉప్పెన` మొదటి సినిమా. దీంతో అది వర్కౌట్‌ అయ్యింది. మరి ఎన్టీఆర్‌కి వర్కౌట్‌ అవుతుందా? అనేది ఇప్పుడు టీమ్‌ని వేదిస్తున్న ప్రశ్న. మరి ఈ విషయంలో తారక్‌ సాహసం చేస్తాడా? మొండిగా రంగంలోకి దిగుతాడా? వెనకడుగు వేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారిందట. ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 8: వల్లి చదువుపై రచ్చ, ఏ కాలేజీలో చదివావమ్మా బల్లి?
Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్