కులదైవం గుళ్లో నయనతార, విఘ్నేష్ శివన్ ప్రత్యేక పూజలు, పిల్లల కోసం నయన్ మొక్కులు..

Published : Apr 06, 2023, 10:59 AM IST
కులదైవం గుళ్లో నయనతార, విఘ్నేష్ శివన్ ప్రత్యేక పూజలు, పిల్లల కోసం నయన్ మొక్కులు..

సారాంశం

పెళ్ళి పిల్లలు.. ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా గడిపేస్తున్నారు నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు. అటు విహారయాత్రలు..ఇటు ఆధ్యాత్మిక యాత్రలు ఏవీ మిస్ అవ్వకుండా.. ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా తమ కులదైవం దేవాలయంల ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ స్టార్ కపుల్.

తమిళ స్టార్ సీనియర్ నయనతార.. ఆమె భర్త తమిళ దర్శకుడు  విఘ్నేష్  శివన్ దంపతులు చెట్టాపట్టాలు వేసుకుని తెగ తిరిగేస్తున్నారు. విహారయాత్రలు.. ఆధ్యాత్మిక యాత్రలు ఏవీ వదలకుండా జంటగాసందడి చేస్తున్నారు.  గత ఏడాది స్టార్టింగ్ లో పెళ్లి చేసుకుని.. అదే ఏడాది అక్టోబర్ 9న సరోగసీ విధానం ద్వారా  కవల పిల్లలకు వీరు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కాగా ఆ పిల్లలకు రీసెంట్ గా నామకరణాలు కూడా చేసి.. వారి పేర్లను ప్రకటించారు నయన్ దంపతులు. ఉయిర్ రుద్రోనీల్ ఎన్.శివన్, ఉలగ్ దైవీక్ ఎన్.శివన్ అనే పేర్లు ఇద్దరు పిల్లకుపెట్టినట్టు వారు వెల్లడించారు. వారి గురించి ప్రత్యేక పూజా కార్యక్రమంలు కూడా చేయిస్తున్నారు తమిళ స్టార్ కపుల్. 

ఇక ఈ క్రమంలో  బుధవారం ఉదయం తమ కులదైవాన్ని దర్శించుకున్నారు నయన్ దంపతులు. నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరు.  బుధవారం ఉదయం తంజావూర్ జిల్లా పాపనాశం సమీపంలోని కులదైవం మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా తమ పిల్లల నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పిల్లల శ్రేయస్సు కోసం.. తమ జీవితంత పాటు తాము నటించే సినిమాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు జంట. 

 

అయితే వీరు టూర్లు వేస్తున్నారు కాని..వారి పిల్లలు ఉయిర్, ఉలగ్ లను మాత్రం ఎక్కడా కనిపించనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. కనీసం వారి ఫోటోలు కూడా బయట కనిపించకుండా దాచేస్తున్నారు. ఇప్పటి వరకూ నయన్ తార కవల పిల్లలు ఫోటోలు బయటకు రాలేదు. వారు కూడా తమ ఫ్యాన్స్ కు కాని.. మీడియాకు కాని కనిపించకుండా దాచేస్తున్నారు. ఇక ఈ ఇద్దరు స్టార్లు తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. నయనతార ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకిరెడీ అయ్యింది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాలో.. షారుఖ్ ఖాన్ జోడీగా 


దీనితో పాటు రాఘవా లారెన్స్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నయనతార. ఇక విఘ్నేష్ శివన్ అజిత్ తో సినిమా చేయాల్సి ఉండగా.. అది ఆగిపోయింది. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మాతగా విఘ్నేష్ ఓసినిమాను చేయాల్సి ఉంది. ఈసినిమా ద్వారా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇటు ఫ్యామిలీ లైఫ్ నుఅటు ప్రొఫిషినల్ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తున్నారు జంట. 


 

PREV
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా