ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమా క్యాన్సిల్‌ః అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

Published : Apr 12, 2021, 08:16 PM IST
ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమా క్యాన్సిల్‌ః అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

సారాంశం

ఇటీవల త్రివిక్రమ్‌ కరోనాకి గురయ్యారు. ఇప్పుడే ఆయన కోలుకున్నారు. వెంటనే ఎన్టీఆర్‌ సినిమాని పట్టాలెక్కిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా బిగ్‌ షాక్‌ ఇచ్చారు ఎన్టీఆర్‌. తన 30వ సినిమాని కొరటాల శివతో చేయబోతున్నట్టు ప్రకటించారు. 

ఎన్టీఆర్‌ తన 30వ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయాల్సి ఉంది. గతేడాది ఈ సినిమాని ప్రకటించారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించనున్నారు. దీనికి సూర్య దేవర నాగవంశీ సమర్పకులు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని అంతా భావించారు. ఇటీవల త్రివిక్రమ్‌ కరోనాకి గురయ్యారు. ఇప్పుడే ఆయన కోలుకున్నారు. వెంటనే ఎన్టీఆర్‌ సినిమాని పట్టాలెక్కిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా బిగ్‌ షాక్‌ ఇచ్చారు ఎన్టీఆర్‌. తన 30వ సినిమాని కొరటాల శివతో చేయబోతున్నట్టు ప్రకటించారు. 

దీంతో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ అభిమానులకే కాదు చిత్ర వర్గాలు సైతం ఆశ్చర్యానికి, షాక్‌కి గురవుతున్నారు. త్రివిక్రమ్‌ సినిమాకి సంబంధించిన ప్రకటన వస్తుందని భావించిన నేపథ్యంలో ఆ స్థానంలో మరో సినిమా రావడం ఊహకందని విధంగా ఉంది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఈ సినిమా చేయడం లేదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు. ఊహించని పరిస్థితుల కారణంగా ఈ సినిమా చేయడం లేదు. కానీ ఎన్టీఆర్‌ అన్నతో చేయాలనే ఎగ్జైట్‌మెంట్‌ అలానే ఉంది. భవిష్యత్‌లో ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ఆశిస్తున్నాం` అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌లకు ఆయన అభినందనలు తెలిపారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?