బేగంపేట ఏయిర్ పోర్ట్ లో సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్తున్నారా..? లేక సడెన్ గా కలుసుకున్నారా..? ఇంతకీ విషయం ఏంటంటే..?
టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలు, ఆర్ఆర్ఆర్ కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎంత క్లోజ్ గా ఉంటారో తెలిసిందే. ఈసినిమాకు ముందు నుంచే వారు మంచి ఫ్రెండ్స్ కాగా.. ఆర్ఆర్ఆర్ టైమ్ లో వారి అనుబంధం మరింతగా పెరిగిపోయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో వీరి కాంబినేషన్ ఎంత హిట్ అయ్యిందో కూడా తెలిసిందే.
ఇక వీద్దరూ ఆర్ఆర్ఆర్ టైమ్ లో ప్రమోషన్ కోసం వీరిద్దరు కలిసి దేశమంతా ట్రావెల్ చేశారు. కాగా తాజాగా హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టులో ఈ ఇద్దరు హీరోలు కలుసుకున్నారు. కాసేపు సందడి చేశారు. అయితే వీరిద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్తున్నారా అన్న డౌట్ ఇరువురు ఫ్యాన్స్ కు రావచ్చు. కాని వీరిద్దరు వేరు వేరు కార్యక్రమాల కోసం వెళ్తూ.. కలిసి ఏయిర్ పోర్ట్ లో కనిపించారు.
and were seen together at Begumpet Airport yesterday evening.
Ram Charan went to Jamnagar for and NTR went to Bengaluru to attend a private event. pic.twitter.com/7vwJ9N0lfn
రామ్ చరణ్ ఇండియాలోదిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకోసం.. గుజరాత్ లోని జామ్ నగర్ కు బయలు దేరారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉపాసనతో కలిసి హైదరాబాద్ నుంచి రామ్ చరణ్ తన సోంత ప్లైట్ లో వెళ్లారు. ఇదే సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంట్లో జరుగుతున్న ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొనేందుకు తారక్ బెంగళూరుకు సతీసమేతంగా స్పెషల్ ప్లైట్ లో వెళ్ళారు.
ఇద్దరూ ఒకే సమయంలో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడంతో అక్కడున్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారక్, చరణ్ ఇద్దరూ చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో... ఇరువురి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.