‘సలార్’ అప్డేట్స్ రాకపోతే ప్రాణం తీసుకుంటా : ప్రభాస్ ఫ్యాన్.. వైరల్ అవుతున్న సూసైడ్ లెటర్

Published : May 16, 2022, 11:13 AM IST
‘సలార్’ అప్డేట్స్ రాకపోతే ప్రాణం తీసుకుంటా : ప్రభాస్ ఫ్యాన్..  వైరల్ అవుతున్న సూసైడ్ లెటర్

సారాంశం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల  కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తుంటారో అందరికీ తెలిసిందే. గతంలో ’రాధే శ్యామ్’ విషయంలో ఓ అభిమాని ప్రాణం తీసుకోగా.. తాజా మరో అభిమాని రాసిన సూసైడ్ లెటర్ వైరల్ అవుతోంది.  

ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి సిరీస్ తర్వాత, అతని అభిమానం సంఖ్య రెట్టింపు అయ్యింది. ప్రభాస్ సినిమాలకోసం పడిచంచేంతలా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ ఏడాది రిలీజ్ అయిన ‘రాధే శ్యామ్’ చిత్రం నెగెటివ్ టాక్ రావడంతో ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని తిలక్ నగర్‌కు చెందిన 24 ఏళ్ల ప్రభాస్ అభిమాని రవితేజ ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’, ‘ఆదిపురుష్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే Radhe Shyam తర్వాత ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అరుదుగా వస్తున్నాయి.  మరీ ముఖ్యంగా కేజీఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. కేవలం నటీనటుల వివరాలను మాత్రమే వెల్లడించారు. కానీ చిత్ర షూటింగ్, ఫస్ట్ లుక్ పై ఎలాంటి అప్డేట్స్ అందించడం లేదు. 

అయితే ప్రస్తుం ప్రభాస్ ఫ్యాన్స్ Salaar చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కనీసం ఏ చిన్న అప్డేట్ వచ్చిన పండగ చేసుకునేంతలా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ నుంచి  ఎలాంటి సమాచారం అందకపోవడంతో ప్రభాస్ డైహార్ట్ ఫ్యాన్ ఒకరు తీవ్రంగా అప్సెట్ అయ్యారు. ఏకంగా సినిమా అప్డేట్స్ రాకపోతే ప్రాణాలు సైతం తీసుకుంటానని హెచ్చరిస్తూ సూసైడ్ లెటర్ రాసి పోస్ట్ చేశాడు. దీంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. 

సలార్ మేకర్స్ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్‌డేట్‌లను ఇవ్వకపోవడంతో ఆ అభిమాని చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సూసైడ్ నోట్ లో ఇలారాసుకొచ్చాడు. ‘సాహో, రాధే శ్యామ్ మరియు ప్రభాస్  మునుపటి సినిమాల సమయంలోనూ అప్డేట్స్ విషయంలో ఇలానే బాధాపడ్డాం. ఎదురు చూసీచూసి నిరాశే దిక్కైంది. ఈ నెలలో తప్పకుండా సలార్ మూవీ నుంచి అప్డేట్ ఇవ్వాలి. లేకపోతనే నేను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాను. మాకు సలార్ అప్డేట్స్ కావాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సూసైడ్ లెటర్ నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ భారీ యాక్షన్ మరియు థిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ రచన మరియు దర్శకత్వం వహించారు. స్టార్-స్టడెడ్ కాస్ట్‌లో ప్రభాస్, శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, దిశా పటాని మరియు జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2022 చివరి నాటికి సినిమాను పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇఫ్పటికే 35 శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. 2023లో సలార్ థియేటర్లలో విడుదల కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్