కొత్త థియేటర్ చిక్కులు: హీరో మహేష్ బాబుకు షోకాజ్ నోటీస్

By telugu teamFirst Published Feb 20, 2019, 8:10 AM IST
Highlights

హీరో మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా జిఎస్టీ యాంటీ ప్రాఫిటీరిం్గ వింగ్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మహేష్ బాబు కొత్త థియేటర్ ఎఎంబీ (ఏషియన్ మహేష్ బాబు) సినిమాస్ జిఎస్టీ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై ఆ షోకాజ్ నోటీసు జారీ అయింది.

హైదరాబాద్: హీరో మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా జిఎస్టీ యాంటీ ప్రాఫిటీరిం్గ వింగ్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మహేష్ బాబు కొత్త థియేటర్ ఎఎంబీ (ఏషియన్ మహేష్ బాబు) సినిమాస్ జిఎస్టీ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై ఆ షోకాజ్ నోటీసు జారీ అయింది. 

మహేష్ బాబు థియేటర్ టికెట్ల ధరలు తగ్గించలేదని, తద్వారా పన్ను తగ్గింపు ప్రయోజనం ప్రేక్షకులు పొందకుండా చేశారని అధికారులు గుర్తించారు. టికెట్ ధర 100కు పైగా ఉన్న సందర్భాల్లో జిఎస్టీ పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. 

టికెట్ ధర రూ. 100, దానికి తక్కువగా ఉన్న సందర్భాల్లో గతంలో ఉన్న 18 శాతం జిఎస్టీ రేటును 12 శాతానికి తగ్గించారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి రావాల్సి ఉంది. 

రంగారెడ్డి జిల్లా జిఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు జంటనగరాల్లో పలు మల్టిఫ్లెక్స్ లను సందర్శించి నమూనా టికెట్లను సేకరించారు. ఎఎంబీ సినిమాస్ పాత రేట్ల ప్రకారమే టికెట్లను అమ్ముతున్నట్లు ఈ తనిఖీల్లో తేలింది. దాంతో అధికారులు మహేష్ బాబుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

click me!