పాక్ సింగర్ ను బహిష్కరించిన సల్మాన్

By Prashanth MFirst Published 19, Feb 2019, 8:49 PM IST
Highlights

దేశమంతా ఏకమై పాకిస్తాన్ కు సంబందించిన ప్రతి విషయంలో ఎదురుదాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. పాక్ సపోర్ట్ తో ఉగ్రదాడి జరిపి 49 జవానులు ప్రాణాలను బలిగొన్న దేశంతో ఎలాంటి సంబంధాలు ఉండకూడదని ప్రతి ఒక్కరు నినాదాలు చేస్తున్నారు. అయితే సినీ పరిశ్రమలో కూడా పాక్ కి సంబందించిన నటీనటులను అలాగే సింగర్స్ ను కూడా బ్యాన్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ సినిమాకు సంబందించిన ఒక పాక్ సింగర్ ని కూడా తప్పించినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కుతోన్న నోట్ బుక్ సినిమాలో పాక్ సింగర్ ఆతిఫ్ అస్లామ్ ఒక పాట పాడాల్సి ఉంది. త్వరలో రీ రికార్డ్ చేయాలని షెడ్యూల్ కూడా సెట్ చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో భారత ఆర్మీపై పై జరిగిన దాడికి వ్యతిరేఖంగా ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు ఉండవద్దని దేశంలో అందరు ముక్తకంఠంతో చెబుతున్నారు. 

దీంతో సల్మాన్ తన సినిమాలో ఆతిఫ్ అస్లమ్ ని పాడించడం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. పుల్వామా దాడిపై సల్మాన్ స్పందించడమే కాకుండా బాధిత కుటుంబాలకు తనవంతు ఆర్థిక సహాయాన్ని అందించాడు.  అలాగే మరో హీరో అజయ్ దేవగన్ తన టోటల్ ధమాకా సినిమాను పాకిస్తాన్ లో రిలీజ్ చెయ్యడం లేదని వివరణ ఇచ్చాడు.  

Last Updated 19, Feb 2019, 8:50 PM IST