దిల్ రాజుపై విజయ్ దేవరకొండ అలక..?

Published : Sep 25, 2018, 03:17 PM IST
దిల్ రాజుపై విజయ్ దేవరకొండ అలక..?

సారాంశం

విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. అయితే ముందుగా ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన వాయిదా వేయాల్సి వచ్చింది. అక్టోబర్ 18న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. 

కానీ నిర్మాత దిల్ రాజు దానికి అడ్డం పడ్డారట. ఆయన ప్రొడక్షన్ లో రూపొందుతోన్న 'హలో గురు ప్రేమకోసమే' సినిమాను అక్టోబర్ 18న విడుదల చేస్తుండడం అదే సమయానికి రావాలనుకున్న 'నోటా'కి అడ్డుపడ్డారు. విజయ్ ట్విట్టర్ లో నిర్వహించిన పోల్ లో కూడా అత్యధిక శాతం జనాలు అక్టోబర్ 5నే విడుదల చేయాలని కోరారు.

దీంతో అదే తారీఖున విడుదల చేయక తప్పడంలేదు. నిజానికి విజయ్ కి అక్టోబర్ 5న విడుదల చేయడం ఎంతమాత్రం ఇష్టం లేదట. అసలు దీనంతటికీ కారణం దిల్ రాజు అని తనను, నిర్మాతలను కూర్చోబెట్టి బలవంతగా ఒప్పించారంటూ విజయ్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడట.

'గీత గోవిందం' తరువాత విడుదల కావడం వంటి కారణాలతో ఈ సినిమాపై మంచి హైప్ అయితే ఏర్పడింది. ఇది ఇలా ఉండగా.. 'నోటా' థియేటర్లోకి వచ్చే వారం గ్యాప్ లో 'అరవింద సమేత' కూడా రానుంది. దీంతో అప్పటికి చాలా థియేటర్ల నుండి 'నోటా'ని ఎత్తేయడం ఖాయం!

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఓటీటీలో తప్పక చూడాల్సిన 7 డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్
Jacqueliene Fernandez: కేన్స్‌లో మరోసారి జాక్వెలిన్ మాయ.. రాహుల్ మిశ్రా డ్రెస్‌లో గ్లామర్ షో