వెంకీ మామ బాగా బిజి.. అఖిల్ డైరెక్టర్ ను కూడా పట్టేశాడు!

By rajesh yFirst Published Sep 25, 2018, 3:15 PM IST
Highlights

ఆయనతో పాటు వచ్చిన హీరోలందరూ స్పీడ్ గా సినిమాలు చేస్తుంటే వెంకీ మాత్రం ఎలాంటి తొందర లేదన్నట్టుగా మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే వెంకీ ఈ మధ్య వరుసగా సినిమాలను ఒకే చేయడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రెండు మల్టి స్టారర్ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. 

 

వెంకీ మామ బాగా బిజి.. అఖిల్ డైరెక్టర్ ను కూడా పట్టేశాడుఒకప్పుడు వరుసగా సినిమాలతో బిజి బిజీగా ఉండే విక్టరీ వెంకటేష్ కొన్నేళ్లుగా చాలా స్లో అయ్యారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో పాటు వచ్చిన హీరోలందరూ స్పీడ్ గా సినిమాలు చేస్తుంటే వెంకీ మాత్రం ఎలాంటి తొందర లేదన్నట్టుగా మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే వెంకీ ఈ మధ్య వరుసగా సినిమాలను ఒకే చేయడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రెండు మల్టి స్టారర్ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో F2 అనే ప్రాజెక్టును ఆల్రెడీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మరో హీరోగా  వరుణ్ తేజ్ నటిస్తుంన్నాడు. ఇక మేనల్లుడు నాగచైతన్య తో వెంకీ మామ అనే కథను కూడా చేయనున్నాడు. కేఎస్.రవీంద్ర (బాబీ) ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ తరువాత త్రినాథ రావు నక్కిన - త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో వెంకటేష్ కలవనున్నారు. 

ఇక ప్రస్తుతం అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరితో కూడా వెంకటేష్ ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం. రీసెంట్ కొన్ని నిమిషాల కథను విన్న వెంకటేష్ కథను పూర్తవ్వగానే సినిమా స్టార్ట్ చెయ్యాలని ఓ మాట అనేసుకున్నారట. దానితో పాటు బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ కూడా ఈ సీనియర్ హీరోకి నచ్చినట్లు టాక్. మొత్తంగా వెంకటేష్ చాలా రోజుల తరువాత బిజి అయ్యారని చెప్పవచ్చు.  

click me!