బిగ్ బాస్2 లో ఎంట్రీ: హెబ్బా ఏమందంటే..

Published : Jul 16, 2018, 03:03 PM ISTUpdated : Jul 16, 2018, 03:12 PM IST
బిగ్ బాస్2 లో ఎంట్రీ: హెబ్బా ఏమందంటే..

సారాంశం

కుమారి 21 ఎఫ్ సినిమా తరువాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకున్న హెబ్బా 'మిస్టర్','అంధగాడు','ఏంజెల్' ఇలా వరుస ఫ్లాప్ లు రావడంతో కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో '24 కిస్సెస్' అనే సినిమా ఒక్కటే ఉంది

బిగ్ బాస్ సీజన్ 2 మొదలయ్యి ఐదు వారాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఐదవ వారంలో భానుశ్రీ షో నుండి ఎలిమినేట్ అయింది. అయితే ఈ షోలోకి వైల్డ్ కార్డ్  ఎంట్రీ ద్వారా టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ రానుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. సీజన్ 1లో నవదీప్, దీక్షా పంత్ లను వైల్డ్ కార్డ్  ఎంట్రీ ద్వారా హౌస్ లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అలానే హెబ్బా కూడా రానుందని కథనాలు ప్రచురించారు. ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది హెబ్బా పటేల్. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయని ఆమె అసహనం వ్యక్తం చేసింది. నేను ఎలాంటి షోలలో పాల్గొనడం లేదు.. బిగ్ బాస్ లో నేను పార్టిసిపేట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడితో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడాలని ఇలా పోస్ట్ పెట్టింది.

కుమారి 21 ఎఫ్ సినిమా తరువాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకున్న హెబ్బా 'మిస్టర్','అంధగాడు','ఏంజెల్' ఇలా వరుస ఫ్లాప్ లు రావడంతో కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో '24 కిస్సెస్' అనే సినిమా ఒక్కటే ఉంది. ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. మరి ఈ సినిమాతో అయినా ఆశించిన విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి!  
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు