నోరా ఫతేహి పేరు వినగానే సినీ ప్రియులకు టెంపర్, బాహుబలి, కిక్ 2, ఊపిరి లాంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ఇటీవల స్పెషల్ సాంగ్స్ లో దుమ్ము రేపుతోంది ఈ బ్యూటీనే. అందాలతో మంటలు రేపే నోరా ఫతేహి సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది.
అంతే కాదు బాలీవుడ్ లో ఏ ఈవెంట్ జరిగినా అక్కడకి కళ్ళు చెదిరే అవుట్ ఫిట్ ధరించి అందరి చూపులు తన అందాలపైనే పడేలా రచ్చ చేస్తూ ఉంటుంది. తమ డ్రెస్సులు డిజైన్ విభిన్నంగా, హాట్ గా ఉండాలనే తాపత్రయంతో విచిత్రమైన కాస్ట్యూమ్స్ ధరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలంటి డ్రెస్సులు వల్ల చిక్కులు ఎదురవుతూ ఉంటాయి.
నోరా ఫతేహికి కూడా తాజాగా అలాంటి విచిత్ర అనుభవమే కలిగింది. ఒక రకంగా ఇది ఊప్స్ మూమెంట్. కొంచెం తేడా జరిగి ఉన్నా ఆమె నేలమీద పడేది. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ముంబైలో బ్రైడల్ కల్చర్ షో నిర్వహించారు. ఈ షోకి పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. వారిలో నోరా ఫతేహి కూడా ఉంది.
నోరా ఫతేహి ఈ ఈవెంట్ కి బ్లాక్ డిజైనర్ శారీలో హాజరైంది. ఆమె ధరించిన ఈ సారీ విచిత్రంగా ఉండనే చెప్పాలి. కొంగు ఉండాలి కాబట్టి అన్నట్లుగా సన్నని తీగలా పైన వేసుకుంది. దీనితో ఆమె ధరించిన బ్రా లాంటి బ్లౌజ్ లో పరువాలన్నీ కనిపిస్తున్నాయి. నడుము మొత్తం కనిపిస్తూ నాభి సొగసుతో మైండ్ బ్లాక్ చేస్తోంది. ముందు దాచుకోవడానికి శారీ ఏమి లేదు కానీ.. వెనుక మాత్రం చాలా పొడవుగా నేలని ఈడ్చుకుంటూ వస్తోంది.
నోరా ఫతేహి డ్రెస్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. కెమెరామెన్స్ ఆమెని ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. నోరా ఫతేహి చుట్టూ ఆమె సహాయకులు వస్తున్నారు. చీర పొడవుగా ఉండడంతో పొరపాటున ఒక సహాయకుడు వెనుక భాగంలో నేలపై ఉన్న చీరని తొక్కాడు. దీనితో నోరా ముందుకు పడబోయింది. వెంటనే తేరుకుని పడకుండా జాగ్రత్త పడింది. అందాలన్నీ కనిపించే ఆ డ్రెస్ లో నోరా ఇలా ఆపసోపాలు పడుతూ ఈవెంట్ కి హాజరైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నోరా ఫతేహి అంటే గ్లామర్ మాత్రమే కాదు కాంట్రవర్సీ కూడా. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ తో పాటు నోరా ఫతేహికి కూడా సంబంధాలు ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆమె ఈడీ విచారణ ఎదుర్కొంది.