అఫీషియల్.. శ్రీవిష్ణు ‘సామజవరగమన’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడ?

By Asianet News  |  First Published Jul 21, 2023, 9:39 AM IST

యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఫిల్మ్ ‘సామజవరగమన’. థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది. ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా విడుదల చేశారు. 
 


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న క్రమంలో ‘సామజవరగమన’ రూపంలో సక్సెస్ దరిచేరింది. మొన్నటి వరకు మాస్ కంటెంట్ చిత్రాల్లో నటించారు. ‘రాజ రాజ చోర’, ‘అర్జున్ ఫల్గుణ’, ‘భళా తందనాన’, ‘అల్లూరి’ వంటి  చిత్రాలతో అలరించేందుకు ప్రయత్నించినా ఆడియెన్స్ కు రీచ్ కాలేకపోయింది. ఈ సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి. దీంతో సక్సెస్ కోసం మళ్లీ కామెడీ బాటనే పట్టారు శ్రీవిష్ణు. ఈ క్రమంలో వచ్చిన చిత్రమే Samajavaragamana. జూన్29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

థియేట్రికల్ రన్ లో మంచి సక్సెస్ ను అందుకుంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ దక్కడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. 12 రోజుల్లోనే ఏకంగా రూ.40 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం థియేటర్ లో సందడి తగ్గడంతో ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో ఓటీటీ ప్రేక్షకులూ ఈ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

ఈ సందర్భంగా ‘సామజవరగమన’ చిత్రం ఓటీటీ డిటేయిల్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. తెలుగు ఓటీటీ సంస్థ అయిన Ahaలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అప్డేట్ అందింది. జూలై 29 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సినిమా విడుదలైన సరిగ్గా నెలరోజులకు ఓటీటీలోకి రాబోతోందీ చిత్రం. రొమాన్స్, డ్రామా అండ్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రంలో బిగిల్‌ (విజిల్‌) ఫేం రెబా మోనికా జాన్‌ (Reba Monica John) కథానాయికగా నటించింది. సుదర్శన్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, వెన్నెల కిశోర్‌, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌, ప్రియ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై రాజేశ్‌ దండా నిర్మించారు. 

 

click me!