
బిగ్ బాస్ హౌజ్ నుంచి ర్యాంప్ హీరో నోయల్ వెళ్ళిపోయాడు. అర్థాంతరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన కీళ్లకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన్ని చెక్ చేసిన వైద్యులు ట్రీట్‌మెంట్ అవసరమని చెప్పారు. ఎక్కువ రోజులు ట్రీట్‌మెంట్ తీసుకోవాలని చెప్పారు. దీంతో రెండు రోజుల క్రితం ఆయన అర్థరాత్రి హౌజ్ నుంచి వెళ్లిపోయారు. త్వరగా కోలుకుని రావాలని బిగ్‌బాస్ కోరారు. దీంతో తిరిగి నోయల్ వస్తారని అంతా హ్యాపీగా ఫీలయ్యారు.
బట్ మ్యాటర్ రివర్స్ అయ్యింది. నోయల్ హౌజ్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు. ఇక రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దీంతో సరైన విధంగా సెండాఫ్ ఇవ్వాలని పిలిపించానని నాగార్జున తెలిపారు. నోయల్ వెళ్ళిపోతున్నారని తెలిసి హౌజ్ మెంబర్స్ అంతా ఎంతో ఎమోషనల్ అయ్యారు. హారిక ఏడ్చేసింది. ఈ సందర్భంగా హౌజ్ మేట్స్ గురించి తనదైన స్టయిల్‌లో అనేక విషయాలు పంచుకున్నారు నోయల్.
ఇక తాను రాలేనని చెప్పాడు. తాను ఇష్టపడిన, అభిజిత్ కోసం, హారిక, లాస్యల కోసం బయట పనిచేస్తానని తెలిపాడు. అభిజిత్‌కి బయట బ్యాక్ బోన్‌లాగా ఉంటానని గెలిపించి తీరుతానని పరోక్షంగా చెప్పాడు. హౌజ్‌లో అందరి కోసం పనిచేశానని, అందరి బాగు కోరుకున్నానని, కానీ ఇప్పుడు ఆ ముగ్గురి కోసం పనిచేస్తానని తెలిపారు. ఇక హౌజ్‌లో ఉన్న తన డ్రెస్సులు మొత్తం నీవే బ్రో అంటూ అభిజిత్‌కి చెప్పాడు. తన గుర్తుగా ట్రిమ్మర్ తీసుకున్నాని అభిజిత్‌కి నోయల్ చెప్పాడు.
ఈ సందర్భంగా అమ్మా రాజశేఖర్, అవినాష్‌లకు క్లాస్ పీకాడు నోయల్. తాను కాలు పెయిన్‌తో బాధపడుతుంటే వీరిద్దరు కామెంట్ చేశారని, కుంటుతూ యాక్ట్ చేశారని చెప్పి ఇద్దరి కాసేపు ఒంటికాలితో నిలబెట్టించాడు. `మీరు పొందిన పెయిన్ కంటే తాను వెయ్యి రెట్ల పెయిన్ అనుభవిస్తున్నాన`ని తెలిపాడు. అలాంటిదాన్ని జోక్ చేస్తారేంటి మాస్టర్ అంటూ ఫైర్ అయ్యారు. అవినాష్ కామెడీతో నటిస్తున్నాడంటూ కామెంట్ చేశారు.
దీంతో అమ్మా రాజశేఖర్, అవినాష్ ఫైర్ అయ్యారు. పోతూ పోతూ మా ఇద్దరిని బ్యాడ్ చేస్తున్నావని, ఇది కరెక్ట్ కాదని తెలిపారు. తాను చేసేది కేవలం జోక్ అని, వినోదం కోసమే అలా చేశానని అందులో తప్పేం లేదని, నీ ముందు కూడా చేయించి చూపానని తెలిపాడు. తాను చేయమంటే అప్పుడు చేయలేదని నోయల్ అన్నాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య వివాదం మరింత పెరిగింది. ప్రేక్షకుల కోసమే ఇక్కడి వరకు వచ్చానని అవినాష్ మరింతగా ఫైర్ అయ్యాడు. దీన్ని నోయల్ మరింత సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యారు. అమ్మా రాజశేఖర్ జీవితంలో ఎన్నో పెయిన్స్ అనుభవించాను, ఇది పెద్ద లెక్క కాదని మండిపడ్డారు.
ఈ మొత్తంలో నోయల్ తాను చెప్పాల్సింది చెప్పేశారని, తప్పు ఉంటే సరి చేసుకోవాలని, ఆయనతో ఏకీభవించకపోతే వదిలేయమని, వెళ్లే ముందు తన అభిప్రాయాలు పంచుకున్నారని నాగ్ సర్ధి చెప్పారు. ఈ సందర్భంగా మిగిలిన వారు కూడా గేమ్ బాగా ఆడాలని నోయల్ చెప్పారు. అర్థాంతరంగా నోయల్ వెళ్ళిపోవడం అందరిని కలచి వేసింది.