తమన్నాని బాహుబలి కూడా కాపాడలేకపోయాడు

Published : Mar 15, 2017, 09:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
తమన్నాని బాహుబలి కూడా కాపాడలేకపోయాడు

సారాంశం

తమన్నాకు తెలుగులో ఆఫర్లు కరువు బాహుబలి తర్వాత సినిమాలు లేని తమన్నా బాహుబలితో క్రేజ్ వస్తుందనుకుంటే రాని ఆఫర్లు

తెలుగు సినీ హీరోయిన్లలో అగ్ర తారల సరసన నిలిచే తార తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై తర్వాత చాలా సినిమాల్లో నటించింది. దాదాపు పదేళ్లు హీరోయిన్ గా సాగించిన తమన్నా.. కెరీర్ ఇక ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో బాహుబలి సినిమాతో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చింది. అర్థ నగ్నంగా నటించి మెప్పించింది. వరుసగా బాహుబలి, ఊపిరి, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలు సక్సెస్ సాధించటంతో తమన్నా కెరీర్ తిరిగి గాడిలో పడినట్టే అనిపించింది. అదే సమయంలో అభినేత్రి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాలేదు.

 

దీంతో మరోసారి తమన్నా కెరీర్ కష్టాల్లో పడింది. త్వరలో బాహుబలి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోన్న తమన్నా, చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. విక్రమ్, శింబు లాంటి హీరోలతో తమిళ నాట సినిమాలు చేస్తున్నా.. ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లు మాత్రం మిల్కీ బ్యూటి దగ్గరకు రావటం లేదు. బాహుబలి సినిమాతో కెరీర్ మలుపు తిరుగుతుందని భావించిన తమన్నాకు తెలుగు తెర మీద నిరాశే ఎదురవుతోంది.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 24: విశ్వక్‌ను చితక్కొట్టిన ధీరజ్, కోపంతో భర్తను కొట్టిన ప్రేమ
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ అరెస్ట్ విషయంలో జ్యోపై అనుమానం- కార్తీక్ నిజం కనిపెడతాడా?