ఆ బ్లాక్ బస్టర్ సినిమాని OTT వాళ్ళు కొనకపోవటం ఏంటి భయ్యా?

Published : Mar 10, 2024, 07:10 AM IST
ఆ  బ్లాక్ బస్టర్ సినిమాని OTT వాళ్ళు కొనకపోవటం ఏంటి భయ్యా?

సారాంశం

 “మంజుమ్మల్ బాయ్స్”కు ఓటిటి క్రేజ్ ఉంటుంది. అయితే ఓటిటి బిజినెస్ ఇప్పటిదాకా కాలేదని తెలుస్తోంది. 


ఒకప్పుడు సినిమా కు థియేటర్ రెవిన్యూనే ఆధారం. కానీ కరోనా వచ్చాక లెక్కలు మారాయి. ఓటిటిల నుంచి వచ్చే రెవిన్యూ ప్రధానం అయ్యిపోయింది. ఓటిటి లెక్కలు వేసుకునే బిజినెస్ లోకి దిగుతున్నారు నిర్మాతలు. మినిమం గ్యారెంటీగా ఓటిటిని భావించి ముందుకు వెళ్తున్నారు. అయితే ఆ లెక్కలకు కాలం చెల్లింది. రీసెంట్ గా ఓటిటి లు ఎగబడి సినిమాలు కొనటం మానేసాయి. రకరకాల లెక్కలు,కాలుక్యులేషన్స్ వేసుకుని ముందుకు సినిమాలు తీసుకుంటున్నాయి. అది ఏ స్దాయికి వెళ్ళిందంటే బ్లాక్ బస్టర్ సినిమాని కూడా ఓటిటి వాళ్లు నో చెప్పేటంతగా. వివరాల్లోకి వెళితే...
 
 మలయాళంలో ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ ను అల్లాడిస్తున్నాయి.   మంజుమ్మెల్ బాయ్స్ సినిమా అయితే రెస్పాన్స్ మామూలుగా లేదు. కేవలం కేరళలో మాత్రమే కాకుండా తమిళ  ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. షోబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసిల్, బాలు వర్ఘీస్ తదితరులు నటించిన ఈ చిత్రం మళయాళ బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో పాటు తాజాగా మాలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మలయాళ సినిమాల్లో ఆల్ టైం టాప్- 3 పొజిషన్ ను దక్కించుకుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమా 'లూసిఫర్' లైఫ్ టైమ్ కలెక్షన్లను 16 రోజుల్లో దాటేసింది మంజుమెల్ బాయ్స్ సినిమా. లూసిఫర్ మొత్తంగా రూ.128 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. అయితే, మంజుమెల్ బాయ్స్ ఇప్పుడు రూ.130 కోట్ల మార్క్ అధిగమించి లూసిఫర్‌ను దాటేసింది.

దాంతో ఖచ్చితంగా “మంజుమ్మల్ బాయ్స్”కు ఓటిటి క్రేజ్ ఉంటుంది. అయితే ఓటిటి బిజినెస్ ఇప్పటిదాకా కాలేదని, ఏ ఓటిటి సంస్ద కూడా ఆ నిర్మాతలు చెప్పిన రేటుకు ఈ సినిమా రైట్స్ తీసుకోవటానికి ఉత్సాహం చూపించటం లేదని వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు 20 కోట్లు ఈ చిత్రం ఓటిటి రైట్స్ కు డిమాండ్ చేస్తున్నారని, కానీ ఓటిటి సంస్దలు మాత్రం పది కోట్లు మించి ముందుకు రావటం లేదని మళయాళ పరిశ్రమనుంచి వార్తలు వస్తున్నాయి. థియోటర్ లో అంత సూపర్ హిట్ అయ్యిన సినిమాని ఓటిటిలో కూడా ఆ రేంజి రెస్పాన్స్ వస్తుందని నిర్మాతలు చెప్తున్నా, ఓటిటి సంస్దలు మాత్రం ఆల్రెడీ అంతమంది చూసేసిన సినిమా కాబట్టి అంతకు మించి డబ్బులు పెట్టలేమని చెప్తున్నాయట. కాకపోతే నెగోషియేషన్స్ జరుగుతున్నాయట. త్వరలోనే ఓ రేటు దగ్గర ఇరు పక్షాలు లాక్ అవుతారని భావిస్తున్నారు. 

మరో ప్రక్క  తమిళనాడులో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారట. కాగా తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని మార్చి 15న తెలుగులో విడుదల చేస్తారట. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుందని తెలుస్తోంది.  తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మంజుమ్మెల్ బాయ్స్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్