‘ప్రేమలు’తెలుగు వెర్షన్ ..టాక్ బాగున్నా కలెక్షన్స్ మాత్రం?

Published : Mar 10, 2024, 06:32 AM IST
‘ప్రేమలు’తెలుగు వెర్షన్ ..టాక్ బాగున్నా కలెక్షన్స్  మాత్రం?

సారాంశం

తెలుగులోకి.. రాజమౌళి తనయుడు కార్తికేయ తీసుకు తీసుకు వచ్చారు.మరి తెలుగు లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తే...

ప్రేమలు మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి కేవలం 12రోజుల్లోనే 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. .ఫుల్ రన్ లో 75కోట్ల వరకు వెళ్లేలానే వుంది. సినిమాలకు ఇది ఫెరఫెక్ట్ సీజన్ కాకపోయినా ప్రేమలు అదరగొడుతుందంటే అందులో కంటెంటే కారణం .కేవలం 3 కోట్ల బడ్జెట్ తో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. కేరళ నుండి సాఫ్ట్ వేర్ జాబ్ చేయడానికి హైదరాబాద్ కు వచ్చిన యువతి,యువకుల మధ్య సాగే ప్రేమ కథ ఇది. యూత్  ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ప్రేమలు మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తోంది.ముఖ్యంగా లవ్ , ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా కావటం కలిసొచ్చింది. ఇక ఈ సినిమాకు మళయాళంలో వస్తున్న రెస్సాన్స్ చూసి తెలుగు లో కూడా  డబ్ చేసి  విడుదలచేసారు.తెలుగులోకి.. రాజమౌళి తనయుడు కార్తికేయ తీసుకు తీసుకు వచ్చారు.మరి తెలుగు లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తే...

తెలుగు వెర్షన్ కు ఓపినింగ్స్ అద్బుతం కాదు కానీ బాగానే వచ్చాయి. అయితే ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో అయితే లేదు. అలాగే ఈ సినిమా ఆడియన్స్  మల్టి ప్లెక్స్ లకే  పరిమితమవుతున్నారు. క్రింద సెంటర్లలో జనం లేరు. మళయాళంలో అంత పెద్ద హిట్ కొట్టిన సినిమాకు రావాల్సిన మేరకు అయితే కలెక్షన్స్ రావటం లేదు. మంచి రివ్యూలు వచ్చినా ,యూత్ ఫుల్ కంటెంట్ ఉన్నా భాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కాకపోవటం ట్రేడ్ ని కంగారుపెడుతోంది. అయితే వీకెండ్ శనివారం థియేటర్స్ లో యూత్ బాగానే కనపడ్డారు. అయితే భారీగా మాత్రం లేరు.

ఎందుకంత తక్కువ రెస్పాన్స్ అంటే మొదట మనకు ఇక్కడ సినిమాలకు అన్ సీజన్. అలాగే   ప్రేమలు లో నటించిన ఏ ఒక్క ఆర్టిస్ట్ కూడా తెలుగు ప్రేక్షకులకి తెలియదు. ఈ సినిమా గురించి తెలిసి చూద్దామనుకున్న హైదరాబాద్ యూత్  చాలా  మంది ఇప్పటికే మళయాళ వెర్షన్ చూసేసారు.  మరికొంతమంది దీన్నో డబ్బింగ్ సినిమా గా చూస్తూ ఓటిటి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మధ్యలో వాళ్ళు దీన్ని వీకెండ్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. దానికి తోడు గోపీచంద్ భీమా, విశ్వక్సేన్ గామి కూడా ఈ వారం రిలీజ్ అయ్యాయి. యూత్ ఎక్కువ మంది దృష్టి గామి మీద ఉంది. మాస్ థియేటర్స్ లో భీమాని జనం చూస్తున్నారు. దాంతో అతి తక్కువ టైమ్ లో అదిరిపోయే క్వాలిటీతో డబ్బింగ్ చేయించినా అనుకున్న స్దాయిలో రెస్పాన్స్ రావటం లేదనే మాట వినపడుతోంది. ఇక వీకెండ్ ఈ రోజు ఆదివారం కూడా దాటితే మరింత కష్టమవుతుంది. అయితే ఈ సినిమా మీద ఎక్కువ పెట్టుబడి పెట్టకపోవటంతో సేఫ్ ప్రాజెక్టు అవుతుందని ట్రేడ్ అంటోంది. మొన్న ముమ్మట్టి సూపర్ హిట్ భ్రమయుగం కూడా మినిమం కలెక్షన్స్ కలెక్ట్ చేయలేక చతికిల పడింది. 
 
ఇక ‘ప్రేమలు’ సినిమా ఒక మంచి లవ్ కామెడీ జోనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. హ్యాపీగా థియేటర్ కి వెళ్లి ఫుల్ గా నవ్వుకొని ఒక మంచి లవ్ స్టోరీ చూడాలనుకుంటే కచ్చితంగా ప్రేమలు సినిమాకి వెళ్లాల్సిందే.  ఈ సినిమాను ప్రముఖ నటుడు పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ నిర్మించగా గిరీష్ ఏడి డైరెక్ట్ చేశాడు.మమితా బైజు,నస్లేన్,అల్తాఫ్ సలీం,మీనాక్షి రవీంద్రన్,అఖిల భార్గవన్ లీడ్ రోల్స్ లో నటించారు.విష్ణు విజయ్ సంగీతం అందించాడు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?