
జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా సుధీర్ , రష్మీ కి చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరించారు.
ఇదంతా ఒకెత్తయితే.. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది.
తాజాగా రష్మీ ఇంట్లో బాధాకర సంఘటన చోటు చేసుకుంది. రష్మీ ప్రేమగా పెంచుకుంటున్న తన పెట్ మరణించింది. తన పెంపుడు కుక్కకి రష్మీ చుట్కి గౌతమ్ అని పేరు పెట్టింది. చుట్కి గౌతమ్ తన బేబీ గర్ల్ అని రష్మీ పోస్ట్ చేసింది.
అయితే కారణాలు తెలియవు కానీ నేడు రష్మీ పెంపుడు కుక్క చుట్కి గౌతమ్ మరణించినట్లు పోస్ట్ చేసింది. మరణించిన కుక్కపై రష్మీ పూలమాలలు వేసిన ఫోటో ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. రీసెంట్ గా చుట్కితో ఎంత ప్రేమగా తాను గడిపానో అనే విషయాన్ని తెలిపే ఫోటోలని కూడా రష్మీ షేర్ చేసింది. ఈ ఫోటోలని చూస్తున్న నెటిజన్లు చుట్కి గౌతమ్ కి సంతాపం తెలుపుతున్నారు. బాధపడకండి.. చుట్కి గౌతమ్ స్వర్గంలో సంతోషంగా ఉంటుంది అని కామెంట్స్ పెడుతున్నారు.