పూరి, రామ్ ప్రాజెక్టుపై ఈ టాక్ నిజమా? రూమరా?

Published : Dec 26, 2018, 09:16 AM IST
పూరి, రామ్ ప్రాజెక్టుపై ఈ టాక్ నిజమా? రూమరా?

సారాంశం

దర్శకుడు పూరీ జగన్నాథ్ త్వరలో హీరో రామ్ పోతినేనితో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు. పూరీ కనెక్ట్స్ చైర్మన్ ఛార్మీ కౌర్ తన ట్విట్టర్ ద్వారా ప్రాజెక్ట్‌కి సంబంధించిన విషయాలు వెల్లడించింది. 

దర్శకుడు పూరీ జగన్నాథ్ త్వరలో హీరో రామ్ పోతినేనితో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు. పూరీ కనెక్ట్స్ చైర్మన్ ఛార్మీ కౌర్ తన ట్విట్టర్ ద్వారా ప్రాజెక్ట్‌కి సంబంధించిన విషయాలు వెల్లడించింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే పూరి స్వయంగా ఈ సినిమా నిర్మించటానికి కారణం ...ఈ ప్రాజెక్టుకు నిర్మాత దొరక్కపోవటమే అని తెలుస్తోంది. అటు రామ్, ఇటు పూరి జగన్నాథ్ ఇద్దరూ కూడా ప్లాఫ్ ల్లో ఉన్నారు. 

దాంతో ఈ ఫ్లాప్ కాంబో తో చేసే ధైర్యం ఎవరికీ కనపడటం లేదు. చివరకు రామ్ స్వంత బ్యానర్ పై కూడా చేయటానికి ఇంట్రస్ట్ చూపలేదు. దాంతో పూరి కు వేరే దారి లేక ఈ సినిమాని తనే స్వయంగా నిర్మించి తనను తాను ప్రూవ్ చేసుకుని నిలదొక్కుకోవాలని చూస్తున్నారట. అసలే రీసెంట్ గా తన కుమారుడు ఆకాష్ కోసం చేసిన మొహబూబ చిత్రం డిజాస్టర్ అవటంతో అసలే పూరి దెబ్బ తిని ఉన్నాడు. దాంతో ఇప్పుడు రామ్ సినిమా కోసం ఫండింగ్ కోసం  ప్రయత్నాలు మొదలెట్టారట.

జనవరిలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటన చేశారు. కొద్ది రోజుల క్రితం చిత్రానికి సంబంధించి కాస్టింగ్ కాల్ ఇచ్చారు. 18 నుండి 24 సంవత్సరాల వయస్సు ఉండి, అచ్చ తెలుగు మాట్లాడే అమ్మాయిలు తన సినిమాకి కావాలని కాస్టింగ్ కాల్ ఇచ్చాడు పూరీ. 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు