కాబోయే భర్త పంపిన మేసేజ్‌లు కూడ చదవనివ్వడం లేదు: రేణు దేశాయ్

Published : Jun 22, 2018, 01:21 PM IST
కాబోయే భర్త పంపిన మేసేజ్‌లు కూడ  చదవనివ్వడం లేదు: రేణు దేశాయ్

సారాంశం

మేసేజ్‌లు కూడ చదవకుండా అడ్డుకొంటున్నారు


హైదరాబాద్: తనకు కాబోయే  భర్త  చేసే మేసేజ్‌లను కూడ తన స్నేహితులు చదవకుండా అడ్డుపడుతున్నారని సినీ నటి రేణూ దేశాయ్ చెప్పారు.  ఈ మేరకు స్విమ‌సూట్‌లో ఫోన్‌లో మేసేజ్‌లు చూస్తుండగా  దిగిన ఫోటోను  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 

తనకు జీవిత భాగస్వామి  దొరికినట్టుగా  ఓ వ్యక్తి చేయి పట్టుకొన్నట్టుగా  ఉన్న ఫోటోను  ఇన్‌స్టా‌గ్రామ్‌లో  పోస్టు చేశారు. జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్టు చెప్పిన కొన్ని రోజులకే  ఈ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ప్రస్తుతం రేణూ దేశాయ్  పిల్లలతో కలిసి గోవాలో  ఉన్నారు.

అయితే తన స్నేహితులు తనకు కాబోయే భర్త  పంపే మేసేజ్‌లను కూడ చదవకుండా అడ్డుపడుతున్నారని ఆమె చెప్పారు.  స్విమ్ సూట్‌లో పోన్ చూస్తున్న సమయంలో తన స్నేహితులే ఈ ఫోటోను తీశారని ఆమె రాశారు.  

తనకు కాబోయే  భర్త పంపే  మేసేజ్ లు కూడ చదువుకొనే ప్రైవసీని తన స్నేహితులు ఇవ్వడం లేదని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు.  అయితే రేణు దేశాయ్ ఎవరిని పెళ్ళి చేసుకొంటుందనే విషయాన్ని మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు.  
 

PREV
click me!

Recommended Stories

మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు
అఖండ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్, బాలయ్యకు భారీ షాక్, గతవారం రిలీజైన 6 సినిమాల రిపోర్ట్ సంగతేంటి?