Bigg Boss Telugu 7: బిగ్ బాస్ షోకి నాగార్జున ఓన్లీ ఆప్షన్?  ఎందుకలా?

By Sambi Reddy  |  First Published Jul 19, 2023, 5:09 PM IST

ఎన్ని విమర్శలు వచ్చినా బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జుననే హోస్ట్ గా కొనసాగిస్తున్నారు. చూస్తుంటే... వారికి మరొక ప్రత్యామ్నాయం లేనట్లుంది. 
 


ఎక్కడో బ్రిటన్ లో బిగ్ బ్రదర్ పేరుతో మొదలైన రియాలిటీ షో ఇండియాలో బిగ్ బాస్ గా ప్రాచుర్యం పొందింది. సెలబ్రిటీలను నాలుగు గోడల మధ్య ఉంచి, వారి లైఫ్ స్టైల్, ఆలోచనలు, పోరాట పటిమ దగ్గరగా చూపించే బిగ్ బాస్ షో ఊహకు మించిన ఆదరణ దక్కించుకుంది. దాంతో అన్ని ప్రాంతీయ భాషలకు వ్యాపించింది. 

తెలుగులో 2017లో బిగ్ బాస్ షో స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారమైన ఫస్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్. టాప్ సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా పాల్గొనడంతో పాటు ఎన్టీఆర్ హోస్టింగ్ స్కిల్స్ కిక్ ఇచ్చాయి. సీజన్ 2 నుండి ఎన్టీఆర్ తప్పుకున్నాడు. నాని రంగంలోకి దిగారు. ఆయనకు జస్ట్ పాస్ మార్క్స్ పడ్డాయి. రేటింగ్ పరంగా ఓకే. 

Latest Videos

తనపై వచ్చిన విమర్శలకు హర్ట్ అయిన నాని మనకెందుకీ తలనొప్పని సీజన్ 3 చేయనన్నాడు. అప్పుడు నాగార్జున రంగంలోకి దిగాడు. మీలో ఎవడు కోటీశ్వరుడు షోతో నాగార్జున ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. హోస్టింగ్ లో అనుభవం ఉన్న నాగార్జున బెస్ట్ ఛాయిస్ అని మేకర్స్ నమ్మారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ మూడు సీజన్స్ సక్సెస్ఫుల్ గా నడిపాడు. సీజన్ 6 విషయంలో ఫెయిల్ అయ్యాడు. దారుణమైన టీఆర్పీ వచ్చింది. చివరికి ఫైనల్ కూడా అట్టర్ ప్లాప్. 

నాగార్జున వీకెండ్ రివ్యూలు, ఎలిమినేషన్స్ విమర్శల పాలయ్యాయి. పక్షపాతంగా వ్యవహరించాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలో సీజన్ 7 కి హోస్ట్ మారతాడంటూ గట్టిగా ప్రచారం జరిగింది. అయితే అవన్నీ అపోహలేనని తేలిపోయింది... కింగ్ నాగార్జునను మరలా రంగంలోకి దించారు. నాగార్జునతో కూడిన బిగ్ బాస్ 7 ప్రోమో వచ్చేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా నాగార్జున కొనసాగించడానికి బలమైన కారణం కూడా ఉంది. 

ఆయన కాకుంటే నెక్స్ట్ బెస్ట్ ఎవరంటే ఎన్టీఆర్, రానా లేదా అన్ స్టాపబుల్ తో మెప్పించిన బాలకృష్ణ. మిగతా స్టార్స్ లో సమర్థులు ఉన్నా లేకున్నా వారికి ఆసక్తి లేదు. పైన చెప్పిన ముగ్గురు కాదంటే టైర్ టూ హీరోలను ఎంచుకోవాలి. నానికి అనుభవం ఉంది కానీ ఆసక్తి లేదు. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ వంటి యాటిట్యూడ్ ఉన్నోళ్లు సెట్ అవుతారు. కానీ చేయడానికి ముందుకు రావాలిగా. నాగార్జున మీద వ్యతిరేకత ఉన్నా మళ్ళీ ఆయన్నే తెచ్చారంటే మరో మార్గం లేకనే అని స్పష్టం అవుతుంది. 
 

click me!