వాళ్లందరితో డేటింగ్ చేసి.. 52 ఏళ్ల వయస్సులో 26 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న నటుడు!

By Asianet News  |  First Published Jul 19, 2023, 3:46 PM IST

సాధారణ వ్యక్తులతో పోల్చితే సెలబ్రెటీల పెళ్లిళ్లు, ప్రేమలు చాలా భిన్నంగా ఉంటాయి. అందులోనూ బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ పెళ్లి విషయం చాలా ఆసక్తికరంగా మారింది. ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
 


సినీ ఇండస్ట్రీలో డేటింగ్స్, లవ్ ట్రాక్ చాలా సాధారణంగా మారాయి. ఏ హీరోయిన్ ఎప్పుడు ఎవరితో లవ్ లో పడుతుందో తెలియడం కష్టంగా మారింది. సడెన్ గా తమ నిశ్చితార్థం అంటూ, పెళ్లి చేసుకోబోతున్నామంటూ షాకిస్తుంటారు. అయితే ఒకొరినొకరు అర్థం చేసుకున్నాక వయస్సు, స్థాయి వంటి అంశాలను పక్కనబెడుతుంటారు. ఇదే బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ (Milind Mohan) విషయంలోనూ జరిగింది. 

పాపులర్ మోడల్ మిలింద్ లైఫ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. అతను వయస్సు ఇప్పుడు 57 ఏళ్లు. 23 ఏళ్లుగా బాలీవుడ్ లో మోడల్ గా, నటుడిగా, ప్రొడ్యూసర్ గా,  టీవీ ప్రజెంటర్ గా అలరిస్తున్నారు. అయితే పర్సనల్ విషయాలకోస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా తన పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. 

Latest Videos

అప్పటికే మిలింద్ చాలా మంది యాక్ట్రెస్ తో ప్రేమలో పడ్డారు. తొలుత ఫ్రెంచ్ నటి మైలీన్ జంపానోయిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి 2006లో వివాహం జరిగింది. ఆ తర్వాత కాస్తా మనస్పార్థాలు ఏర్పడి మూడేళ్లకే 2009లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇక రెండో పెళ్లికి చాలా సమయం తీసుకున్నారకు. ఏకంగా తొమ్మిదేళ్లపాటు ఒంటిగానే ఉన్నారకు. ఈ సమయంలో మిలింద్ చాలా మంది నటీమణులతో లవ్ ట్రాక్ నడిపించారు. 

మిలింద్ డేటింగ్ కొనసాగించిన లిస్టులో మోడల్ మధుసప్రే, నటి షహానా గోస్వామి, దీపానిత శర్మ, గుల్ పనాగ్ ఉన్నారు. కొన్నాళ్లు అలా జీవితం సాగింది. ఈ సమయంలోనే తనకంటే 26 ఏళ్లు చిన్నదైన ఎంబీకే అనలిట్ ప్రొఫెషనల్ అంకిత కున్వర్ (    Ankita Kunwar) ని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి 2018లో వివాహం జరిగింది. ఐదేళ్లుగా వీరి వివాహ బంధం ఆనందంగా కొనసాగుతోంది

అయితే, మిలింద్ అకింతను పెళ్లి చేసుకున్న సమయానికి 52 ఏళ్లు దాటారు. అప్పుడు అంకితకు కేవలం 26 ఏళ్లేనంట. ఇంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సెలబ్రేటీలు మామూలుగా ఐదేళ్లు, పదేళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నా ఒక్కటయ్యారు. కానీ ఏకంగా 20 ఏళ్లకు పైగా వయస్సు తేడా ఉన్నా పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. తాజాగా రివీల్ అయిన ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం  మిలింద్ ‘ఎమెర్జెన్సీ’ చిత్రంలో నటిస్తున్నారు. 

 

click me!