ఆ న‌టికి అవ‌కాశాలు రావడంలేదా

Published : Dec 10, 2016, 06:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఆ న‌టికి అవ‌కాశాలు రావడంలేదా

సారాంశం

సూప‌ర్ హిట్ అయ్యిన ప్రేమమ్ మూవీ ఒక్క‌సారిగా ఓ వెలుగు వెలిగిన ప్రేమ‌మ్ ఫేమ్ సాయి ప‌ల్ల‌వి దింతో సినిమాల ప్రస్తావనలో సాయి పల్లవి పేరు వినిపించింది


అనేక సినిమాల ప్రస్తావనలో సాయి పల్లవి పేరు వినిపించింది. సౌతిండియాకు సాయిపల్లవి ఫీవర్ వచ్చినట్టుగా అనిపించింది. అయితే.. ఆమె పేరు అంతలా మార్మోగినా అందుకు తగ్గ అవకాశాలు మాత్రం రాలేదు ఈ భామకు.
కార్తీ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందే సినిమాకు సాయి పల్లవినే హీరోయిన్ గా అనుకున్నారు.

 గౌతమ్ మీనన్ తన సినిమా ఒక దానికి ఆమెనే పరిగణనలోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అలాగే సంతానం హీరో గా ఒక సినిమాలో సాయి పల్లవి కోసం ప్రయత్నిస్తున్నారనే అన్నారు. ఈ ప్రాజెక్టుల్లో సాయి పల్లవి పేరు వినిపించినట్టుగానే వినిపించింది కానీ, అంతిమంగా ఆమెను ఆ అవకాశాలు వరించలేదు.

మణిరత్నం సినిమాలో అదితీరావ్ హైదరీ హీరోయిన్ అయ్యింది. గౌతమ్ మీనన్ వేరే హీరోయిన్ ను పెట్టుకున్నాడు, సంతానం సినిమాలో కూడా వేరే హీరోయిన్ తెరపైకి వచ్చింది. ఇలా సాయి పల్లవి నటిస్తుందనుకున్న సినిమాల్లో వేరే హీరోయిన్లు అవకాశాన్ని సంపాదించుకున్నారు.

‘ప్రేమమ్’ తర్వాత దుల్కర్ సల్మాన్ సినిమా ఒకదాంట్లో హీరోయిన్ గా చేసింది ఈమె. చేతిలో ‘ఫిదా’ ఉంది. విక్రమ్ సినిమాలో నటిస్తుందని చెప్పినా.. వాళ్లు కూడా ఈమె బదులు మరో హీరోయిన్ ను చూసుకున్నారనే మాట వినిపిస్తోంది. మరి ఈ అవకాశాలు ఎందుకిలా చేజారుతున్నాయంటే.. పారితోషకం కూడా ఒక రీజన్ అంటున్నారు. ఈమెకు అరకోటి ఇవ్వడానికి ఒక్క ‘ఫిదా’ రూపకర్తలకు తప్ప మరెవరికీ ఆసక్తి లేకపోయిందనే మాట వినిపిస్తోంది

PREV
click me!

Recommended Stories

Sushmita Sen House: సముద్రం పక్కనే సుస్మితా సేన్ ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే!
Cocktail 2 Trailer Review: షాహిద్ తో రష్మిక, కృతి సనన్ బోల్డ్ రొమాన్స్.. గ్లామర్ షో తప్ప ఇంకేం లేదా ?