నయన్ పారితోషికం రూ.7 కోట్లా?

Published : Dec 10, 2016, 06:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
నయన్ పారితోషికం రూ.7 కోట్లా?

సారాంశం

హీరోయిన్ ఓరియంటెడ్‌ చిత్రాల్లో అధికంగా నటిస్తున్న‌న‌య‌న‌తార‌ భారిగా పారితోషికం డిమాండ్ చేస్తున్న న‌య‌న‌తార‌ ఒక్క‌సారిగా ఏడు కోట్ల రూపాయ‌లు అడుగుతున్న సినీతార‌

 

నటి నయనతార విషయానికే వస్తే కోలీవుడ్‌లో రూ.10 లక్షల పారితోషికంతో ప్రారంభమైన తన కెరీర్‌ ఇప్పుడు కోట్లకు చేరింది. మొన్నటి వరకూ మూడు కోట్లు పుచ్చుకున్న ఈ మాలీవుడ్‌ సంచలన తార ఇటీవల నాలుగు కోట్లు డిమాండ్‌ చేస్తున్నారట. ఏంటి అప్పుడే ఆశ్చర్య పోతున్నారా? ఈ మొత్తం హీరోల సరసన నటించడానికేనట.

నయనతార ఈ మధ్య హీరోయిన్ ఓరియంటెడ్‌ చిత్రాల్లోనే అధికంగా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. మాయ చిత్రం నుంచి ఈ తరహా చిత్రాల అవకాశాలు ఆమె తలుపు తట్టడం ఎక్కువైంది. ప్రస్తుతం నయనతార నటిస్తున్న డోరా, ఇమైక్కా నోడిగళ్, అరం, కొలైయుధీర్‌ కాలం తదితర చిత్రాలన్నీ కథానాయకి చుట్టూ తిరిగే కథా చిత్రాలే.

 ఇలాంటి చిత్రాలకు ఆ జాన పారితోషికం డిమాండ్‌ చేస్తున్నదెంతో తెలుసా? అక్షరాలా ఏడు కోట్లట. ఇది ఏ దక్షిణాది తార పొందనటు వంటి మొత్తం అని వేరే చెప్పాలా’ అయితే ఇది టూమచ్‌ అంటున్నారు సినీ వర్గాలు. నయనతార చిత్రాలు లాభాలు గడిస్తున్నాయి అందుకే అంత పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారనే వారూ లేక పోలేదు.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు