సూపర్ స్టార్కి మేజర్ సర్జరీ తప్పదట

Published : Dec 10, 2016, 06:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
సూపర్ స్టార్కి మేజర్ సర్జరీ తప్పదట

సారాంశం

మొకాలి నొప్పితో  భాధాప‌డుతున్న బాలీవుడ్  బాద్షా  షారూక్ ఖాన్ రాయిస్ ట్రైలర్ లాంచ్ లో  మోకాలికి నీ బ్యాండ్‌తో దర్శనమిచ్చిన షారుఖ్‌ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారడంతో  మరోసారి  సర్జరీ తప్పదట

 

ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా. సంజయ్ దేశాయ్ ఈ విషయాలను వెల్లడించారు.  క్రితంసారి పెయిన్ కిల్లర్స్, ఇంజెక్షన్ల ద్వారా చికిత్స నిర్వహించాం. కానీ వరుస షూటింగులు, వరుస గాయాలతో అతడి పరిస్థితి ఇప్పుడు మరీ అధ్వాన్నంగా తయారైందని చెప్పారు. 

విశ్రాంతి లేకుండా పని చేస్తున్న షారుఖ్‌కి మరోసారి ఆర్థోస్కోపిక్ సర్జరీ చేసి మోకాలిలో వున్న డ్యామేజీ భాగానికి చికిత్స చేయాల్సిన అవసరం వుందని చెప్పారు. అంతేకాదు ఆయనకు ఈసారి కచ్చితంగా విశ్రాంతి అవసరం అని   డా.దేశాయ్  తేల్చి చెప్పారు. మరోవైపు రాయిస్ ప్రమోషనలో పాల్గొన్న షారూక్ మోకాలి గాయం బాగా వేధిస్తోందని, కొంచెం సేపు  నిలబడినా బాగా పెయిన్ వస్తోందంటూ చెప్పుకొచ్చారు.

  ఈ నొప్పిని తట్టుకోవడానికి మెటాలిక్ నీ(మెకాలిచిప్ప) క్యాప్ ధరిస్తున్నానని చెప్పారు.  సాధ్యమైనంత త్వరలోనే మరో  మేజర్ సర్జరీ కి వెళ్లనున్నట్టు అభిమానులతో పంచుకున్నారు.కాగా  ప్రస్తుతం జనవరి 2017 లోవిడుదల కానున్న రాయిస్   ప్రమోషన్ లో  బిజీగా ఉన్నాడు. నిత్యం గాయాలతో సతమతమయ్యే షారూఖ్   2013లో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 2015లో ఎడమ కిమోకాలి చిప్పకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు