MAA elections మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి చిరుకు ఆహ్వానం లేదా?

Published : Oct 16, 2021, 11:56 AM ISTUpdated : Oct 16, 2021, 12:04 PM IST
MAA elections మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి చిరుకు ఆహ్వానం లేదా?

సారాంశం

మా సభ్యులకు మోహన్ బాబు ఫోన్ చేసి ఆహ్వానించారట.  మా సభ్యులందరికి మెస్సేజ్ రూపంలో ఇన్విటేషన్ పంపారట. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఎటువంటి ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. 

నేడు మా అధ్యక్షడుగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాటు పూర్తి కాగా, వేడుకకు చిత్ర ప్రముఖులు చేరుకుంటున్నారు. మంచు విష్ణుతో పాటు తన ప్యానెల్ తరపున గెలిచిన సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మంచు విష్ణు గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. రెండు రోజుల నుండి సినీ పెద్దలను తన ప్రమాణస్వీకార వేడుకకు Manchu Vishnu స్వయంగా ఆహ్వానించడం జరిగింది. దీనిలో భాగంగా ఇటీవల బాలయ్య నివాసానికి మోహన్ బాబు, విష్ణు వెళ్లారు. 


ఇక మిగతా మా సభ్యులకు మోహన్ బాబు ఫోన్ చేసి ఆహ్వానించారట.  మా సభ్యులందరికి మెస్సేజ్ రూపంలో ఇన్విటేషన్ పంపారట. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఎటువంటి ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం Chiranjeevi ని మంచు విష్ణు, మోహన్ బాబు.. ఇద్దరిలో ఎవరు కూడా ఆహ్వానించలేదని సమాచారం. పరిశ్రమకు పెద్ద దిక్కుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన చిరంజీవిని ఆహ్వానించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇగోలు, గొడవలు వదిలేసి చిరంజీవికి గౌరవంతో కూడిన ఆహ్వానం పంపి ఉండాల్సిందని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. 

Also read MAA elections మా కు పోటీగా ఆత్మా వస్తే జరిగే పరిణామాలు దారుణం... నష్టపోయేదివారే!
MAA elections ఫలితాల అనంతరం మంచు విష్ణు చిరంజీవిపై కొన్ని ఆరోపణలు చేశారు. చిరంజీవి అంకుల్ తనను ఎన్నికల నుండి తప్పొకోమన్నారని, చరణ్ కూడా నాకు ఓటు వేసి ఉండడు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎన్నికల తరువాత Prakash raj ప్యానెల్ తరపున గెలిచిన సభ్యులు రాజీనామాలు చేశారు. అలాగే Mohan babu, మంచు విష్ణు, నరేష్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి ఆరోపణలు, నిర్ణయాల వెనుక చిరంజీవి ఉన్నట్లు భావిస్తున్న మోహన్ బాబు కుటుంబం చిరంజీవికి ఆహ్వానం పంపలేదని అంటున్నారు. 

Also read Unstoppable బాలయ్యతో టాక్ షో.. అల్లు అరవింద్ వ్యూహం ఇదేనా!

2015 నుంచి అధ్యక్షపదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతల్ని స్వీకరించడం అన్నది ఒక ఆనవాయితీగా వస్తోంది. కానీ దానికి భిన్నంగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి ముందే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు హాజరవ్వాలి అనే విషయంలో ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. 2019 లొ ఏర్పాటు చేసిన క్రమశిక్షణా సంఘానికి కృష్ణం రాజు చైర్మన్ గా వ్యహరిస్తున్నారు. ఇందులో మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధ, చిరంజీవి సభ్యులుగా ఉన్నారు. చిరంజీవి డీఆర్సీ నుంచి గతేడాది రాజీనామా చేశారు. అయితే దాన్ని అప్పట్లో సభ్యులు ఆమోదించలేదు. ఈ డీఆర్ సీ పదవీకాలం ఎన్నికలు పూర్తయ్యే దాకా మాత్రమే ఉంటుదని , ఆ తర్వాత కొత్త గా ఏర్పడిన కమిటీ కార్యవర్గం ఈ సంఘాన్ని కొనసాగించాలా లేదా అనే విషయంలో నిర్ణయం తీసుకుంటుందని మా ప్యానెల్ అడ్వైజర్ కృష్ణ మోహన్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి