
రీసెంట్ గా ప్రీ రిలీజ్ పంక్షన్ కూడా ఘనంగానే చేసారు. విజయదేవరకొండ వచ్చినా బజ్ క్రియేట్ కాలేదు. సర్లే విషయం ఉంటే ..ఓ పూట లేటైనా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి నిలబడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీ లైన్ అంటూ ఓ కథనం బయిటకు వచ్చింది. అదేమిటో చూద్దాం.
అందుతున్న సమాచారం మేరకు... అభి (రాహుల్ విజయ్) కు ఇంట్లో పెళ్లి చేసుకో అని పీకేస్తూంటారు పేరెంట్స్. అతను తనకు సరైన జోడి కోసం వెతుకుతూ... కాంతం(నిహారిక) తో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. కాంతంకు తన గతాన్ని నేరేట్ చేస్తున్న క్రమంలో హఠాత్తుగా గా ఓ రోజు కాంతం మాయమవుతుంది.
తన తల్లి ఆకస్మిక మరణం అనంతరం కాంతం ఎటెళ్లిపోయిందో అభికి తెలీదు. కొద్ది రోజుల తర్వాత అభి వేరొక కొత్తమ్మాయి (భెసానియా) తో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ ముందుకు వెళ్తుందనగా..ఊహించని విధంగా ఈ ప్రేమికుల మధ్య అనూహ్యమైన మలుపు. సూర్యకాంతం మళ్లీ వస్తుంది. దాంతో అభి జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. ఆ వచ్చాక అతని లైఫ్ లో ఎలాంటి పెను మార్పులు చోటు చేసుకున్నాయి? అన్నదే సినిమా కథాంశం.
‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇద్దరు అమ్మాయిల మధ్యలో స్ట్రగుల్ అయ్యే పాత్రలో రాహుల్ విజయ్ నటన నన్ను ఆకట్టుకుంది. రాహుల్‌లో ఆ టాలెంట్ ఉంది కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తున్నా. నా లైఫ్‌లోనే కాదు, ఎవరి లైఫ్‌లోనూ సూర్యకాంతం ఉండకూడదు’’ అన్నారు.
సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ’ డైరెక్టర్ ప్రణీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్‌విజయ్ హీరోగా నటిస్తున్నారు. నిహారికది విభిన్న పాత్రలో కాబోతోంది.