లక్ష్మీస్ ఎన్టీఆర్: సీక్రెట్ బిజినెస్?

Published : Mar 28, 2019, 05:18 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్: సీక్రెట్ బిజినెస్?

సారాంశం

టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ లో సందడి చూసి చాలా కాలమవుతోంది. F2 తరువాత ఏ సినిమా కూడా కలెక్షన్స్ లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఇక వివాదాల సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎంతవరకు ఎగురుతుంది అనేది మరికొన్ని గంటల్లో తేలుతుంది. 

టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ లో సందడి చూసి చాలా కాలమవుతోంది. F2 తరువాత ఏ సినిమా కూడా కలెక్షన్స్ లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఇక వివాదాల సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎంతవరకు ఎగురుతుంది అనేది మరికొన్ని గంటల్లో తేలుతుంది. మాములుగా ప్రతి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో ఉంది అనే విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. 

కానీ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ప్రీ రిలీజ్ లెక్కలు చాలా సీక్రెట్ గా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇకపోతే మొదటి షోకే హౌస్ ఫుల్ కలెక్షన్స్ లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్స్ దర్శనమిస్తాయని వర్మ ఇప్పటికే ప్రమోషన్స్ బజ్ పెంచేస్తున్నాడు. ఆ సంగతి అటుంచితే.. సినిమా ఎంతకు అమ్ముడుపోయింది.. బయ్యర్స్ ఇంతకు కొన్నారు.., డిస్ట్రిబ్యూటర్స్ ఏ రేంజ్ లో సినిమాను వదులుతున్నారు అనేది ఇప్పటివరకు ఒక అంచనా లెక్కలు లేవు. 

సినిమా వాయిదా పడకముందు 15 కోట్ల వరకు తెలుగురాష్ట్రాల్లో ధర పలికినట్లు ఒక రూమర్ వైరల్ అయ్యింది. ఇక సినిమా టోటల్ ప్రీ రిలీజ్ వర్మ 20కోట్లకు నెట్టుకొచ్చినట్లు కూడా కథనాలు ప్రింట్ అయ్యాయి. అయితే వర్మ ప్రతి విషయంలో క్లారిటీ ఇస్తున్నారు గాని బిజినెస్ విషయంలో మాత్రం నోరెత్తడం లేదు. ఇక అమెరికాలో ప్రీమియర్స్ ను గట్టిగానే ప్లాన్ చేశారు. దాదాపు 125లొకేషన్స్ లో సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. మరి సినిమా అక్కడ ఏ రేంజ్ లో డాలర్స్ ను రాబడుతుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్