డైరెక్షన్‌ చేస్తానంటోన్న నివేదా థామస్‌.. హీరోయిన్‌గా చేయదా?

Published : Jun 02, 2021, 05:08 PM IST
డైరెక్షన్‌ చేస్తానంటోన్న నివేదా థామస్‌.. హీరోయిన్‌గా చేయదా?

సారాంశం

టాలెంటెడ్‌ హీరోయిన్‌ నివేదా థామస్‌ డైరెక్షన్‌ చేస్తుందట. తాను దర్శకత్వం చేస్తానని చెప్పింది. గతంలోనూ తనకు డైరెక్షన్‌పై ఆసక్తిని వెల్లడించింది నివేదా.

టాలెంటెడ్‌ హీరోయిన్‌ నివేదా థామస్‌ డైరెక్షన్‌ చేస్తుందట. తాను దర్శకత్వం చేస్తానని చెప్పింది. గతంలోనూ తనకు డైరెక్షన్‌పై ఆసక్తిని వెల్లడించింది నివేదా. దీన్ని మరోసారి రిపీట్‌ చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ని ప్రారంభించిన నివేదా థామస్‌ ఇప్పుడు ఇటు తెలుగు, అటు తమిళం, మలయాళంలోనూ రాణిస్తుంది. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` చిత్రంలో కీలక పాత్రలో నటించి వాహ్‌ అనిపించింది. అద్భుతమైన నటనతో మెప్పించింది. ఇదే కాదు, పాత్ర ఏదైనా దాన్ని రక్తికట్టించడంలో నివేదా ముందుంటుంది. 

ఈ క్రమంలో తాజాగా మరోసారి తన మనసులోని మాటని వెల్లడించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే డైరెక్షన్‌ కోర్స్ పూర్తి చేసిందట. అందుకే భవిష్యత్‌లో కచ్చితంగా దర్శకత్వం చేస్తానని చెబుతుంది. ముందుగా కొన్ని లఘు చిత్రాలకు దర్శకత్వం వహిస్తానని, ఆ తర్వాత సినిమాలకు దర్శకత్వం చేస్తానని తెలిపింది నివేదా. మరి ఈ అమ్మడి డైరెక్షన్‌ కల ఎప్పుడు నెరవేర్తుంది? ఎలా డైరెక్షన్‌ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం నివేదా తెలుగులో `మిడ్‌నైట్‌ రన్నర్‌` అనే రీమేక్‌ చిత్రంలో నటిస్తుంది. హీరోయిన్‌గా ఈ అమ్మడికి అడపాదడపా అవకాశాలే వస్తుండటం గమనార్హం. మరి హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో సినిమాలు రాకపోవడం కారణంగానే, లేక తాను హీరోయిన్‌గా ఎక్కువ కాలం మనుగడ సాధించలేననే ఆలోచనతో డైరెక్షన్‌ చేయాలని భావిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ilaiyaraaja Secrets: మణిరత్నంను పరిచయం చేసింది నేనే.. ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు!
Rajinikanth Remuneration: కమల్‌ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డ్ రెమ్యూనరేషన్‌.. ఇండియాలోనే టాప్‌