కిస్ సీన్ రిహార్సల్స్ చేద్దాం రా అంటూ... నటికి చేదు అనుభవం

By Surya PrakashFirst Published Jun 2, 2021, 1:19 PM IST
Highlights

ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. తన కెరీర్‏లోని చేదు ఘటనను గుర్తుచేసుకుంది జరీన్ ఖాన్. గతంలో ఓ సారి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె మాట్లాడారు. ఇప్పుడు మళ్లీ ఆ సంఘటనను ఓ బాలీవుడ్ మీడియాతో షేర్ చేసుకున్నారు.

క్యాస్టింగ్ కౌచ్ అంటే ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని విషయంగా మారిపోయింది. తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తోంది. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి రమ్మని అడిగే ఈ  ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. చాలా మందికి ఈ విషయమై చేదు అనుభవాలు ఉన్నాయి. దాంతో అందరూ ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. తన కెరీర్‏లోని చేదు ఘటనను గుర్తుచేసుకుంది జరీన్ ఖాన్. గతంలో ఓ సారి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె మాట్లాడారు. ఇప్పుడు మళ్లీ ఆ సంఘటనను ఓ బాలీవుడ్ మీడియాతో షేర్ చేసుకున్నారు.
 
జరీనా ఖాన్ మాట్లాడుతూ...బాలీవుడ్ లో సినిమా అవకాశాల కోసం తిరిగుతున్న సమయంలో ఇండస్ట్రీలో ఓ వ్యక్తితో పరిచయం జరిగింది. జీవితంలో అతడి కంటే గొప్ప వ్యక్తి లేడన్నట్లుగా మాట్లాడేవాడు అంది. అలాగే తాను నటించే ఓ చిత్రంలో కిస్సింగ్ సీన్ లో నటించాల్సి ఉందని.. దాని కోసం రిహార్సల్ చేయాలని పిలిచాడు. కిస్సింగ్ సీన్ రిహార్సల్స్ పేరుతో నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మనసులోని భయాలను పక్కన పెట్టు అంటూ దారుణంగా ప్రవర్తించేవాడు అంటూ జరీన్ ఖాన్ తెలిపింది. 

అలాగే తన దారిలోకి మలుచుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నించాడని.. ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా క్లోజ్ గా ఉండాలని.. ఆఫర్ల విషయాలను తను చూసుకుంటాను అంటూ మిస్ బీహేవ్ చేశాడని జరీన్ ఖాన్ తెలిపింది. అయితే ఇండస్ట్రీకి కొత్త కావడంతో తను సర్దిచెప్పుకొన్నానని.. ఆ వ్యక్తి పేరు చెప్పడం కూడా ఇష్టం లేదని జరీన్ ఖాన్ తెలిపింది. కాల్ సెంటర్ లో పనిచేస్తూ.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే దానిని అని తెలిపింది. 

జరీన్ ఖాన్.. సల్మాన్ ఖాన్ సరసన వీర్ సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘హౌస్ ఫుల్ 2’ ‘హేట్ స్టోరీ 3’ ‘అక్సర్ 2’ ‘1921’ ‘హమ్ భీ అఖేలే తుమ్ భీ అఖేలే’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. 

click me!