Nivetha Thomas : తన తల్లిని ఎత్తుకున్న హీరోయిన్ ‘నివేదా థామస్’.. నీ ప్రేమ బరువును మోస్తానమ్మ అంటూ..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 29, 2022, 03:40 PM IST
Nivetha Thomas : తన తల్లిని ఎత్తుకున్న హీరోయిన్ ‘నివేదా థామస్’.. నీ ప్రేమ బరువును మోస్తానమ్మ అంటూ..

సారాంశం

హీరోయిన్ ‘నివేదా థామస్’ ఎప్పుడూ చాలా ఎనర్జీగా, యాక్టివ్ గా కనిస్తూ ఉంటుంది. అప్పడప్పుడు అల్లరి చేష్టలు చేస్తూ కనిపిస్తుందీ హీరోయిన్.. అయితే వాళ్ల అమ్మ పుట్టిన రోజు సందర్భంగా తల్లిని చంటిపాపలా ఎత్తుకుంది నివేదా...      

అమ్మ అంటే హీరోయిన్ నివేదా థామస్ కు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేకపోయింది. అందుకే ఆమె తల్లి లిల్లీ థామస్ పుట్టిన  రోజు సందర్భంగా ఏకంగా తన వీపుపై ఎత్తుకుని ‘అమ్మ.. నీకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ విష్ చేసింది  నివేదా. ‘నేను ఈ లోకాన్ని వీడేంత వరకు నువ్వు నాపై చూపించే ప్రేమ బరువును మెస్తానమ్మ’ అంటూ కాస్తా ఎమోషనల్ అయ్యింది.  

కాగా, నివేదా తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఎప్పుడూ హ్యాపీగా గడుపుతుంది. అటు తమ్ముడితో, ఇటు రిలేషన్స్ తోనే ఎక్కువ సమయం కేటాయిస్తుంటుంది నివేదా థామస్. ఇటీవల ఓ రెస్టారెంట్ లో కాఫీ తాగే స్టైల్, నందమూరి నటసింహం బాలక్రిష్ణ నటించిన ‘అఖండ’ మూవీలోని జై బాలయ్య సాంగ్ కు తమ్ముడు నిఖిల్ థామస్ తో కలిసి ఫన్నీగా స్టెప్పులేయడం తన అభిమానులను, నెటిజన్లను చాలా ఆకట్టుకుంది. 

 

అయితే తాజాగా నివేదా తన తల్లిని ఎత్తుకొని దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు నివేదకు తల్లిపై ఉన్న ప్రేమను  చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లిని చిన్నపాపలా ఎత్తుకోని తన ప్రేమను తెలియజేసిన నివేదా పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  

 మరోవైపు తన అభినయంతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్న నివేదా థామస్  రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీలో నటిచింది. త్వరలో మరో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందు రానుంది. షూటింగ్ జరుపుకుంటున్న ‘మీట్ క్యూట్’, ‘శాకిని డాకిని’ మూవీల్లో నివేదా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. శాకిని డాకిని మూవీలో ‘రెజినా కాసండ్రా’ (Regina Cassandra) తో కలిసి నటించనుంది నివేదా. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వారణాసి లో మహేష్ బాబు తండ్రి పాత్రను మిస్సైన ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
Illu Illalu Pillalu Today Episode Dec 16: అమూల్య ప్రేమ వేషాలు కళ్లారా చూసిన పెద్దోడు, నాన్నకి చెప్పేందుకు సిద్ధం