వయసులో తనకంటే చిన్నహీరోతో నిత్యామీనన్ రొమాన్స్!

Published : May 09, 2019, 02:53 PM IST
వయసులో తనకంటే చిన్నహీరోతో నిత్యామీనన్ రొమాన్స్!

సారాంశం

నటి నిత్యామీనన్ కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. తన పాత్రలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 

నటి నిత్యామీనన్ కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. తన పాత్రలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మొదటి నుండి వైవిధ్యమైన కథలను ఒప్పుకుంటూ వస్తోన్న ఈ బ్యూటీ తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇందులో హీరోగా రాజ్ తరుణ్ కనిపిస్తాడట. నిత్యామీనన్, రాజ్ తరుణ్ కాంబినేషన్ అనగానే ఆశ్చర్యం కలగడం ఖాయం. ఎందుకంటే రాజ్ తరుణ్.. నిత్య కంటే వయసులో చిన్న. అలాంటిది తెరపై వీరిద్దరి రొమాన్స్ అంటే చూడడానికి చాలా కష్టంగా ఉంటుందేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.

అయితే అదే ఈ కథ స్పెషాలిటీ అంటున్నాడు దర్శకుడు విజయ్ కుమార్ కొండా. గతంలో 'గుండెజారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' వంటి సినిమాలను తెరకెక్కించిన విజయ్ సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చాడు. మధ్యలో తన పెళ్లి గొడవతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు తన మూడో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 

కథ ప్రకారం.. సినిమాలో హీరో తనకంటే వయసులో పెద్ద అమ్మాయిని ప్రేమిస్తాడట. ఈ నేపధ్యంలో సాగే సంఘటనలతో సినిమాను తెరకెక్కించనున్నారు. కథ ప్రకారం.. నిత్య, రాజ్ తరుణ్ లను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన రానుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా