మా ‘టైటానిక్‌’ను మీ ‘అవెంజర్స్‌’ ముంచేసింది!

By AN TeluguFirst Published May 9, 2019, 1:50 PM IST
Highlights

వరల్డ్ వైడ్ గా  వసూళ్ల సునామీ సృష్టిస్తున్న చిత్రం 'అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌'. 

వరల్డ్ వైడ్ గా  వసూళ్ల సునామీ సృష్టిస్తున్న చిత్రం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’. రీసెంట్ గా రిలీజైన ఈ చిత్రం  మరో మైలురాయి చేరుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. సినీ చరిత్రలోనే హైయిస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రాల లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్న ‘టైటానిక్‌’ను ఈ సినిమా వెనక్కు నెట్టేసింది. 

‘టైటానిక్‌’చిత్రం 2.187 బిలియన్‌ డాలర్లు వసూలు చేయగా ‘ఎండ్‌గేమ్‌’ ఇప్పటికే 2.188 బిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. అంతేకాదు.. యమ స్పీడుగా 2 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిన సినిమాగా ‘అవతార్‌’ పేరిట ఉన్న రికార్డును సైతం బద్దలుకొట్టింది.  ఈ నేపథ్యంలో టైటానిక్ దర్శకుడు కెమరూన్‌ ‘ఎండ్‌గేమ్’సక్సెస్ పై ఓ ట్వీట్‌ చేశారు.  మార్వెల్‌ సంస్థ అధినేత, నిర్మాత కెవిన్‌ ఫీజ్‌ ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసారు. 

‘కెవిన్‌ ఫీజ్‌ .. నిజమైన టైటానిక్‌ ఓడను ఓ ఐస్‌బర్గ్ ముంచేసింది. కానీ నా ‘టైటానిక్‌’ను మీ ‘అవెంజర్స్‌’ ముంచేసింది. మా నిర్మాణ సంస్థ లైట్‌స్టార్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని స్టాఫ్ మీ సక్సెస్ కి సెల్యూట్‌ చేస్తున్నారు. సినీ పరిశ్రమ సజీవంగానే కాదు అంతకంటే గొప్పగా ఉంది అని మీరు ప్రూవ్ చేసారు’ అని పేర్కొన్నారు. ఇవన్నీ చెప్తూ... ‘టైటానిక్‌’ను ‘అవెంజర్స్‌’ ముంచేస్తున్నట్లుగా డిజైన్‌ చేసిన ఫొటోను అభిమానులతో షేర్ చేసారు. 

‘అవతార్‌’కు 2 బిలియన్‌ డాలర్ల మార్కు  చేరుకోవడానికి 47 రోజులు పట్టగా ‘ఎండ్‌గేమ్‌’ 11 రోజుల్లోనే దాన్ని అందుకుంది. ఈ చిత్రం ముందున్న లక్ష్యం ఒక్కటే. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘అవతార్‌’ పేరిట ఉన్న రికార్డును కైవసం చేసుకోవడం. ‘అవతార్‌’ 2.787 బిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించింది. ఆ రికార్డును బద్దలుకొట్టడం ‘ఎండ్‌గేమ్‌’కు పెద్ద కష్టమేం కాదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

 

pic.twitter.com/zfICH1XDCJ

— James Cameron (@JimCameron)
click me!