
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం శుక్రవారం థియేటర్స్ లో విడుదలైంది. దీనితో పవన్ అభిమానుల సంబరాలతో తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపించింది. యూఎస్, బ్రిటన్ దేశాల్లో కూడా పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ చిత్ర రిలీజ్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. భీమ్లా నాయక్ మూవీ రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. చిత్ర యూనిట్ ఆల్రెడీ సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా మొదలు పెట్టారు.
భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ నటించింది. అలాగే రానాకి జోడిగా సంయుక్త మీనన్ నటించింది. కానీ భీమ్లా నాయక్ ప్రమోషన్స్ సంయుక్త మీనన్ అందరిని ఆకర్షించింది. నిత్యామీనన్ ఎక్కడా కనిపించలేదు. కనీసంసోషల్ మీడియాలో కూడా నిత్యా మీనన్ భీమ్లా నాయక్ గురించి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.
దీనితో నిత్యా మీనన్ గురించి చాలా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. భీమ్లా నాయక్ విషయంలో నిత్యా మీనన్ బాగా హర్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాకి ముందు ఈ చిత్రంలో తన పాత్రని స్ట్రాంగ్ గా ఎలివేట్ చేస్తానని త్రివిక్రమ్ మాట ఇచ్చారట. సినిమాలో నిత్యా మీనన్ రోల్ స్ట్రాంగ్ గానే ఉన్నప్పటికీ కామియో రోల్ లాగా షార్ట్ గా ఉంటుంది.
దీనికి తోడు చిత్ర పాడిన అంత ఇష్టం అనే సాంగ్ ని కూడా మూవీలో పెట్టలేదు. దీనికి నిత్యామీనన్ నొచ్చుకున్నట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తన ఇష్క్ మూవీ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిత్యామీనన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అలాగే తన ఇతర కార్యక్రమాలని ప్రమోట్ చేసుకుంటోంది. కానీ భీమ్లా గురించి ఎలాంటి కామెంట్ ఈ బ్యూటీ షేర్ చేయలేదు. కాబట్టి సహజంగానే ఇలాంటి రూమర్స్ వైరల్ అవుతూ ఉంటాయి.