
నటి పూనమ్ పాండే జీవితం ఎక్కువగా వివాదాలతో నిండి ఉంటుంది. బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారింది. ఆ మధ్యన అశ్లీల చిత్రాలతో రచ్చ చేసింది. ఎవరేమనుకున్నా నా పంథా ఇంతే అంటూ బోల్డ్ గా అశ్లీల చిత్రాల్లో నటించింది. దీని కోసం పూనమ్ పాండే సొంతంగా ఓ యాప్ ని లాంచ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవల రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సమయంలో కూడా పూనమ్ పాండే హాట్ కామెంట్స్ చేసింది. పోర్న్ చిత్రాల కోసం రాజ్ కుంద్రాకి చెందిన వారు తననని సంప్రదించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ హాట్ బ్యూటీ. అలాగే పూనమ్ పాండే భర్త సామ్ బాంబే ఇటీవల ఆమెపై దాడి చేయగా.. అతడిపై కేసు నమోదు చేసింది.
ఇదిలా ఉండగా పూనమ్ పాండే ప్రస్తుతం కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'లాక్ అప్' అనే రియాలిటీ షోలో పాల్గొంటోంది. ఈ షోలో పూనమ్ పాండే తన పర్సనల్ లైఫ్ పై పరోక్షంగా హాట్ కామెంట్స్ చేసింది. లైఫ్ లో తాను చేసిన పొరపాట్లని ఈ షోలో పూనమ్ గుర్తు చేసుకుంది.
గతంలో నేను చాలా కాంట్రవర్సీలకు గురయ్యాను. దీనితో చాలా మంది నన్ను జడ్జ్ చేశారు. కానీ పరిస్థితుల ప్రభావంతోనే నేను వివాదాల్లో చిక్కుకోవాల్సి వచ్చింది. మెచ్యూరిటీ లేక కొన్ని సమస్యల్లో చిక్కుకున్నా. ఆ తర్వాత వర్క్ లేకపోవడంతో నాకు నేను కొన్ని తప్పులు చేయాల్సి వచ్చింది. కొందరిని నమ్మి ఆ తప్పులు చేశా. ఆ తర్వాత 15 నిమిషాల పాటు చూసి ఎంజాయ్ చేసే ఖ్యాతి నాకు వద్దని రియలైజ్ అయినట్లు పూనమ్ పరోక్షంగా అశ్లీల చిత్రాలపై కామెంట్స్ చేసింది.
నేను ఎప్పుడూ తప్పు చేయాలని భావించలేదు. నాలో ఉన్న నటిని బయటకు తీసుకురావాలనే ప్రయత్నించాను. కానీ నన్ను కొందరు రాంగ్ వే లో సలహాలు ఇచ్చారు అంటూ పూనమ్ వాపోయింది. పూనమ్ పాండే గతంలో వెండితెర చిత్రాల్లో కూడా నటించింది. 2011 ప్రపంచకప్ సమయంలో టీమ్ ఇండియాని ఉద్దేశిస్తూ పూనమ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే ఆటగాళ్ల ముందు తాను న్యూడ్ గా డాన్స్ చేస్తానని ప్రకటించింది. అప్పట్లో దేశం మొత్తం పూనమ్ ని పెద్దఎత్తున ట్రోల్ చేశారు.