Radhe Shyam Movie Update : ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ మూవీకి డైరెక్టర్ రాజమౌళి వాయిస్... ఏఏ భాషలో ఎవరంటే..

Published : Feb 27, 2022, 05:33 PM IST
Radhe Shyam Movie Update : ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ మూవీకి డైరెక్టర్ రాజమౌళి వాయిస్... ఏఏ భాషలో ఎవరంటే..

సారాంశం

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే  అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) వాయిస్ అందించగా.. తాజాగా జక్కన కూడా వాయిస్ ఓవర్ అందించినట్టు  అప్డేట్ ఇచ్చారు మేకర్స్..  తమిళం, కన్నడలోనూ స్టార్స్ వాయిస్ ఇచ్చారు.  

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాధే శ్యామ్’. 1970లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌కు తోడు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఈ సినిమా కోసం మేకర్స్ చాలా కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధే శ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా రెబల్ స్టార్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. 

ఈ సినిమాకు నెరేటర్‌గా  పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli). రాధే శ్యామ్ సినిమాకు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తెలుగులో జక్కన్న వాయిస్ ఓవర్ ఇస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar).. మలయాళంలో పృథ్విరాజ్  సుకుమారన్ (Prithivi Raj).. తమిళంలో సత్యరాజ్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఇప్పటికే హిందీలో బాలీవుడ్ బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే వీరికి మేకర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇండియా, ఓవర్సీస్‌లో అత్యంత ఘనంగా ఈ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. 

ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యూవీ క్రియేష‌న్స్  ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.  కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, తదితరులు పలు కీలక పాత్రల్లో నటించనున్నారు. మార్చి 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ బ్యానర్లపై నిర్మాతలు వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పవన్ కళ్యాణ్ తో పోటీ పడి చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా?
Illu Illalu Pillalu Today Episode Jan 2: అమూల్యకు పెళ్లిచూపులు, ఈలోపే విశ్వక్ అదిరిపోయే ప్లాన్