RRRలో నిత్యామీనన్ కీరోల్

By Prashanth MFirst Published Apr 11, 2019, 7:40 AM IST
Highlights

ప్రముఖ దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్ టైటిల్‌) ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంభందించి రోజుకో వార్త మీడియాలో వస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రంకోసం నిత్యామీనన్ కు టెస్ట్ షూట్ చేసారని సమాచారం

ప్రముఖ దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్ టైటిల్‌) ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంభందించి రోజుకో వార్త మీడియాలో వస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రంకోసం నిత్యామీనన్ కు టెస్ట్ షూట్ చేసారని సమాచారం. అయితే ఏ పాత్ర కోసం ఆమెను తీసుకున్నారనేది తెలియరాలేదు. కాకపోతే ఎన్టీఆర్ సరసన ఆమెను తీసుకున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన తర్వాత  ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన ఎవరు చేయబోతున్నారు?.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారిందీ ప్రశ్న.  నిత్యామీనన్ కు ఈ చిత్రం టీమ్ నుంచి పిలుపు వచ్చిన మాట నిజమే కానీ ఎన్టీఆర్ సరనస కాదని తెలుస్తోంది. ఆమెది స్వాతంత్ర్య సమయంలో కనపడే ఓ మహిళా స్వాతంత్ర్య యోధురాలి పాత్ర అని వినపడుతోంది. 

నిత్యా మేనన్‌ లుక్‌ టెస్ట్‌ కోసం ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రావటంతో ఈ వార్త బయిటకు వచ్చింది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో అల్లూరి సీతా రామరాజుగా రామ్‌ చరణ్‌‌, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. చెర్రీకి జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

click me!