శ్రీదేవి చిన్న కూతురు.. ఓ నిర్ణయానికొచ్చేసింది!

Published : Apr 10, 2019, 08:14 PM IST
శ్రీదేవి చిన్న కూతురు.. ఓ నిర్ణయానికొచ్చేసింది!

సారాంశం

  జాన్వీ కపూర్ మొదటి సినిమా అంతగా ఆడకపోయినా అవకాశాలను మాత్రం బాగానే అందుకుంటోంది. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కూడా తన కెరీర్ పై ఒక నిర్ణయం తీసుకుందట.

టాలీవుడ్ - బాలీవుడ్ అని తేడా లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఒక చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి తన కూతుళ్లను వెండితెరపై చుసుకుకోవాలని ఎంతగానో ఆశపడింది. పెద్ద కూతురు జాన్వీ ఆమె సమక్షంలోనే మొదటి సినిమా స్టార్ట్ చేసినప్పటికీ శ్రీదేవి ఆ సినిమా చూడకుండానే కనుమూసింది. 

జాన్వీ కపూర్ మొదటి సినిమా అంతగా ఆడకపోయినా అవకాశాలను మాత్రం బాగానే అందుకుంటోంది. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కూడా తన కెరీర్ పై ఒక నిర్ణయం తీసుకుందట. మొదట ఖుషి మోడలింగ్ బిజినెస్ లో బిజీ అవ్వాలని అనుకుంది. కానీ మనసులో నటనపై కూడా ఇష్టం ఉండడంతో తరచు ఎటువైపు వెళ్లాలో తెలియక కాస్త ఆందోళన చెందిందట. 

ఈ విషయాన్నీ జాన్వీ కపూర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక ఫైనల్ గా ఖుషి యాక్టింగ్ వైపు వెళ్ళడానికి సిద్దమవుతున్నట్లు కపూర్ ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చేసింది. అలాగే అమెరికాలో స్పెషల్ గా యాక్టింగ్ పై శిక్షణ తీసుకోవడానికి ఖుషి రెడీ అయినట్లు జాన్వీ వివరణ ఇచ్చింది. ఇక ఖుషిని బాలీవుడ్ కి పరిచయం చేసే బాధ్యతలను కరణ్ జోహార్ తీసుకున్నట్లు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?