మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ డే కలెక్షన్స్... ఆ టాక్ ఏంటి వచ్చిన వసూళ్లు ఏంటి!

By Sambi ReddyFirst Published Aug 13, 2022, 11:56 AM IST
Highlights

మిక్స్డ్ టాక్ లో మాచర్ల నియోజకవర్గం వసూళ్లు దుమ్ముదులిపింది. ఫస్ట్ డే నితిన్ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటాడు. ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో మాచర్ల నియోజకవర్గం చిత్రానికి ఊహించని ఆదరణ దక్కింది. 
 

విడుదలకు ముందు మాచర్ల నియోజకవర్గం మూవీ రాజకీయ వివాదాల్లో చిక్కుకుంది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి వైఎస్సార్సీపీ అభిమాని, అతడు ఇతర రాజకీయ పార్టీలకు, కులాలకు వ్యతిరేకంగా గతంలో సోషల్ మీడియాలో పోస్ట్స్ వేశారంటూ ఓ వర్గం మీడియా వివాదం తెరపైకి తెచ్చింది. రాజశేఖర్ రెడ్డి ట్వీట్స్ అంటూ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వివాదానికి హీరో నితిన్, దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చారు. 

ఇక ఆగస్టు 12న విడుదలైన మాచర్ల నియోజకవర్గం చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన నిలిపివేయగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి షో పడగానే సినిమా బాగాలేదంటూ ట్వీట్స్ వెలిశాయి. ఇది ఓ రొటీన్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్, సినిమాలో విషయం లేదని తేల్చేశారు. అయితే రేటింగ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. ఫస్ట్ డే సాలిడ్ వసూళ్లు దక్కాయి. 

ఏపీ/తెలంగాణాలో ఫస్ట్ డే మాచర్ల నియోజకవర్గం రూ. 4.62 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. నైజాంలో రూ.1. 42 కోట్లు, సీడెడ్ లో రూ. 75 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 68 లక్షల షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఇక ఏపీ/తెలంగాణలలో రూ. 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మాచర్ల నియోజకవర్గం నాలుగో వంతు పెట్టుబడి రాబట్టింది. శని, ఆదివారాలు ఘనంగా ముగిస్తే మాచర్ల నియోజకవర్గం బ్రేక్ ఈవెన్ కావడం అంత కష్టమేమి కాదు. ఈ రెండు రోజుల్లో ఈ మూవీ భవితవ్యం తేలనుంది. ఇక ఈ మూవీలో నితిన్ కి జంటగా కృతి శెట్టి నటించారు.    

ఏపీ/తెలంగాణలలో ఏరియా వారీగా వసూళ్లు వివరాలు... 

నైజాం: 1.42 కోట్లు
సీడెడ్: 75 లక్షలు 
UA: 68లక్షలు 
తూర్పు: 46లక్షలు 
పశ్చిమ: 19లక్షలు 
గుంటూరు: 56లక్షలు 
కృష్ణ: 30లక్షలు 
నెల్లూరు: 26లక్షలు 

ఏపీ/తెలంగాణా మొత్తం:- 4.62 కోట్లు (7.05 కోట్లr~ గ్రాస్)

click me!