Tamannah: లక్ అంటే తమన్నాదే... ఏకంగా సూపర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసింది!

Published : Aug 13, 2022, 08:38 AM IST
Tamannah: లక్ అంటే తమన్నాదే... ఏకంగా సూపర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసింది!

సారాంశం

తమన్నా మరో క్రేజీ ప్రాజెక్ట్  ఖాతాలో వేసుకున్నారు. ఏకంగా రజినీకాంత్ తో జోడి కట్టే ఛాన్స్ కొట్టేశారు. జైలర్ మూవీ హీరోయిన్ గా తమన్నా ఎంపికయ్యారు.   

15 ఏళ్లకు పైగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా జోరు ఇంకా తగ్గలేదు. ఎప్పటికీ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ సత్తా చాటుతుంది. ఏకంగా రజినీకాంత్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది తమన్నా. రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్ హీరోయిన్ గా తమన్నా ఎంపికయ్యారు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. దర్శకుడు నెల్సన్  దిలీప్ కుమార్ తమన్నాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. 

పాలిటిక్స్ లోకి వెళ్ళేది లేదని తేల్చి చెప్పిన రజినీకాంత్(Rajinikanth)... సినిమాలపై దృష్టి పెట్టారు. ఆయన వరుసగా ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. గత ఏడాది పెద్దన్న గా ప్రేక్షకులను అలరించిన రజినీకాంత్, నెక్స్ట్ జైలర్ గా రానున్నారు. డాక్టర్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ స్టార్స్ దృష్టిని ఆకర్షించాడు. విజయ్ తో ఆయన చేసిన బీస్ట్ అనుకున్న స్థాయిలో ఆడకున్నప్పటికీ రజినీకాంత్ అవకాశం ఇచ్చాడు. కళానిధి మారన్ నిర్మాతగా జైలర్(Jailer) చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 

కొద్దిరోజుల క్రితం రజినీకాంత్ స్టైలిష్ లుక్ తో కూడిన అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ హీరోయిన్ గా తమన్నా(Tamannah Bhatia) నటిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. కెరీర్ లో మొదటిసారి తమన్నా రజినీకాంత్ కి జంటగా నటిస్తున్నారు. కెరీర్ ఫేడ్ అవుట్ దశలో సూపర్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ దక్కడం నిజంగా విశేషం. మరోవైపు తెలుగులో తమన్నా చిరంజీవికి జంటగా భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. అలాగే తెలుగులో సత్య దేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం చిత్రం చేస్తున్నారు. మరో మూడు హిందీ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం