‘చెక్‌’ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? న‌ష్ట‌మెంత‌?

Surya Prakash   | Asianet News
Published : Mar 08, 2021, 03:26 PM IST
‘చెక్‌’ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? న‌ష్ట‌మెంత‌?

సారాంశం

ఫస్ట్ డే కేవలం 3.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసిన చెక్.. ఆ తర్వాత రెండు రోజుల్లోనూ అంతే తక్కువ వసూళ్లను తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా దారుణంగా చెక్ వసూళ్లు పడిపోయాయి.

 దాదాపు ఏడాది గ్యాప్‌  తర్వాత  రెండు వారాల క్రితం (ఫిబ్రవరి 26) చెక్‌ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. `చెక్‌`పై చాలా ఎక్సపెక్టేషన్స్ ఏర్ప‌డ్డాయి. చంద్ర శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా కావ‌డం, పోస్టర్స్, ట్రైలర్స్ ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమాపై ఫోక‌స్ ఏర్ప‌డింది. అయితే.. `చెక్‌` అన్ని విధాలా నిరాశ ప‌రిచింది. రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ రావ‌డం, ఆ టాక్ కు తగినట్లుగానే సినిమా ప్ర‌మోష‌న్లని పట్టించుకోకపోవటం జరిగింది. దాంతో ఈ సినిమా ఫ్లాప్ నుంచి డిజాస్ట‌ర్ వైపుకు అడుగులేసింది. కొత్త తరహా కథ, వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన ‘చెక్‌’పై నితిన్‌ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్‌’ యేలేటి కెరీర్ కే చెక్ చెప్పే పరిస్దితి తెచ్చి పెట్టింది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం నిర్మాతల పరిస్దితి ఏమిటి ..ఎంత నష్టం వచ్చింది విషయాలు చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ  సినిమా దాదాపుగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుపుకుంది. అయితే ఫస్ట్ వీక్ గ‌డిచే స‌రికి.. వ‌సూళ్లు ఏడున్నర నుంచి 8 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయాయి. ఈ వీకెండ్ అయితే `చెక్‌` థియేట‌ర్ల‌లో జ‌న‌మే లేరు. శ‌ని, ఆది వారాలు కాస్త టికెట్లు తెగే ఛాన్సు ఉందనుకున్నా పబ్లిసిటీ లేకపోవటంతో అదీ కనపడలేదు. ఇక ఇది పెరిగే అవ‌కాశ‌మే కనపడటం లేదు. దాంతో... దాదాపు 9 కోట్ల మేరకు న‌ష్టాల్ని బ‌య్య‌ర్లు భ‌రించాల్సివ‌స్తోందని సమాచారం. ఎంత కష్టపడినా 8 కోట్లు రాబ‌ట్టుకోవ‌డం అసాధ్యం కాబ‌ట్టి, బ‌య్య‌ర్లు... ఈసినిమాతో తీవ్ర న‌ష్టాల్ని ఎదుర్కోక త‌ప్ప‌దనే అంటున్నారు. 

 ‘భీష్మ’ సినిమాతో మరోసారి హిట్ అందుకున్న తర్వాత అందరూ నితిన్... ఇక ఇప్పుడైనా గ్యాప్ లేకుండా విజయాలు అందిస్తాడనుకుంటే… ‘చెక్’ సినిమాతో సేమ్ స్టోరీ రిపీట్ అయింది. ఎనిమిది కోట్ల వరకు థియేటర్లో లాస్. ఇది పెద్ద ఫ్లాప్. ఏదో అద్భుతం జ‌రిగితే త‌ప్ప‌... చెక్ బ‌య్య‌ర్లు న‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డే ఛాన్స్ లేదు. ఈ సినిమా ప్ర‌భావం నితిన్ నుంచి రాబోయే `రంగ్ దే`పై ప‌డే ప్ర‌మాదం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?