ఒకవైపు కరోనా పరిస్థితులు చక్కబడుతుండటం, మరోవైపు వ్యాక్సిన్ రావటంతో నెమ్మదిగా థియేటర్లు తెరుచుకున్నాయి. సంక్రాంతి కానుకగా పలు తెలుగు సినిమాలు వెండితెరపై సందడి చేసాయి. అయితే ఇప్పటికి కొన్ని చిత్రాలు ఓటీటీకే మొగ్గు చూపుతున్నాయి. అయితే థియోటర్లు వంద శాతం ఆక్యుపెన్సీ కు ఫర్మిషన్ రావటంతో అంతకు ముందు ఓటీటికి అనుకున్న సినిమాలు సైతం థియోటర్ లో దూకటానికి ఉత్సాహం చూపుతున్నారు. అలాంటివాటిల్లో నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’ ఒకటి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రియల్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే అంతకు ముందే ప్రముఖ ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని ఇచ్చి హక్కులు పొందింది. దాంతో జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా దీన్ని విడుదల చేయటానికి ప్లాన్ చేసారు. అయితే నాగ్,నిర్మాతలు మనస్సు మార్చుకుని థియోటర్ రిలీజ్ కు మ్రొగ్గు చూపటంతో నెట్ ఫ్లిక్స్ ఇరుకున పడింది. కాకపోతే నెట్ ఫ్లిక్స్ రూల్స్ ప్రకారం ఎగ్రిమెంట్ రద్దు చేసుకున్నందుకు నష్ట పరిహారం చెల్లించారని వినపడుతోంది. అంతే కాదు... వైల్డ్ డాగ్ సినిమా ఓటీటీ హక్కులు థియేటర్లో విడుదలైన తరవాత నెట్ ఫ్లిక్స్ కే తక్కువ రేటుకి ఇస్తామని హామీ ఇచ్చారట. దాంతో.. వైల్డ్ డాగ్ ఓటీటీ విడుదల ఆగి, థియేటర్ విడుదలకు మార్గం ఏర్పడింది.
ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. దాదాపు ఎక్కువమంది కొత్తవాళ్లతోనే ఈ సినిమా చేశారు నాగార్జున. ఈ సినిమాలో నాగార్జున ఎన్.ఐ.ఎ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మను పోలీస్ శాఖలో అందరూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
`గగనం` తర్వాత నాగార్జున ఇలాంటి ప్రయోగం తరహా పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ , తక్కువ వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేసి అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: షానీ డియోల్.