రెండో కుమారుడిని పరిచయం చేసిన కరీనా కపూర్‌.. బట్‌ ట్విస్ట్

Published : Mar 08, 2021, 12:30 PM IST
రెండో కుమారుడిని పరిచయం చేసిన కరీనా కపూర్‌.. బట్‌ ట్విస్ట్

సారాంశం

కరీనా కపూర్‌ తన కుమారుడిని పరిచయం చేసింది. ఇటీవల ఆమె పండింటి మగబిడ్డకి జన్మినిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తన రెండో బాబుని అభిమానులకు చూపించలేదు కరీనా. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విషెస్‌ తెలియజేస్తూ బాబుని ఎత్తుకుని ఉన్న ఫోటోని పంచుకుంది.

కరీనా కపూర్‌ తన కుమారుడిని పరిచయం చేసింది. ఇటీవల ఆమె పండింటి మగబిడ్డకి జన్మినిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తన రెండో బాబుని అభిమానులకు చూపించలేదు కరీనా. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విషెస్‌ తెలియజేస్తూ బాబుని ఎత్తుకుని ఉన్న ఫోటోని పంచుకుంది. `మహిళలకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు` అని పేర్కొంది కరీనా. 

అయితే విషెస్‌ తెలియజేయడం పట్ల అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ రెండో కుమారుడిని సరిగా చూపించనందుకు తెగ ఫీల్‌ అవుఉన్నారు. గత నెల ఫిబ్రవరి 21న కరీనా కపూర్‌ రెండో కుమారుడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భర్త సైఫ్‌ అలీఖాన్ ప్రకటించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే తమ అభిమాన నటి కుమారుడు ఎలా ఉంటాడో చూడాలని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కరీనా పూర్తిగా ఆ బాబుని చూపించలేదు. తన భుజంపై ఎత్తుకున్న కరీనా కుమారుడి ముఖం కనిపించడం లేదు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ 2012లో ప్రేమించి పెద్ద సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇప్పటి సైఫ్‌కి వివాహం జరిగింది. ఆమెకి విడాకులిచ్చారు. వీరికి 2016లో మొదటి కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌ జన్మించారు. ఐదేళ్ల తర్వాత రెండో కుమారుడికి జన్మనిచ్చింది కరీనా. కరీనా ప్రస్తుతం అమీర్‌ ఖాన్‌తో `లాల్‌సింగ్‌ చద్దా`తోపాటు `తాకత్' అనే సినిమాల్లో నటించింది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ