నితిన్ భార్యకు కరోనా.. అయినా ప్రేమతో ఏం చేశాడో తెలుసా, వీడియో వైరల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 07, 2022, 09:35 AM IST
నితిన్ భార్యకు కరోనా.. అయినా ప్రేమతో ఏం చేశాడో తెలుసా, వీడియో వైరల్

సారాంశం

యంగ్ హీరో నితిన్ 2020లో ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి శాలినితో నితిన్ వివాహం జరిగింది. నాలుగేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు.

యంగ్ హీరో నితిన్ 2020లో ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి శాలినితో నితిన్ వివాహం జరిగింది. నాలుగేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు. వివాహం తర్వాత నితిన్ తరచుగా సోషల్ మీడియాలో ఫ్యామిలీ విశేషాలని, సరదా ఫోటోలని షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి నితిన్ ఇంటిని కూడా తాకింది. నితిన్ భార్య షాలిని కరోనా బారిన పడ్డారు. దీనితో ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఐసొలేషన్ ఉన్నారు. షాలినికి కరోనా, పుట్టినరోజు ఒకేసారి వచ్చాయి. ఫ్యామిలీ మొత్తం కలసి ఆమె బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోవడం కుదరదు. తన భార్య బర్త్ డేని ఎలాగైనా సెలెబ్రేట్ చేయాలని నితిన్ భావించాడు. దీనికోసం ఓ ఐడియా వేశాడు నితిన్. 

తన భార్యని ఇంట్లో పైగదిలోనే ఉంచాడు. ఇంటి కింద కేక్ కటింగ్ ఏర్పాటు చేశాడు. ఇదంతా షాలిని గదిలో నుంచి కిటికీలో చూస్తూ ఉంది. నితిన్ కేక్ కట్ చేసి తన భార్యకు బర్త్ డే విషెస్ తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ ఆ మారింది. 

ఈ వీడియోని నితిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కరోనాకి అడ్డంకులు ఉన్నాయి. కానీ ప్రేమకి లేవు. హ్యాపీ బర్త్ డే మై లవ్. లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు నెగిటివ్ కావాలని కోరుకుంటున్నా' అంటూ నితిన్ ఆసక్తికర కామెంట్స్ పోస్ట్ చేశాడు. 

ఈ వీడియో షూట్ చేసింది డైరెక్టర్ వెంకీ కుడుముల అని కూడా నితిన్ కామెంట్ పెట్టాడు. నితిన్ , వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన 'భీష్మ' చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నితిన్ కి గత ఏడాది మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. 

నితిన్ నటించిన రంగ్ దే, చెక్, మ్యాస్ట్రో చిత్రాల గత ఏడాది విడుదలయ్యాయి. రంగ్ దే పర్వాలేదనిపించగా చెక్ మూవీ నిరాశపరిచింది. ఇక ఓటిటిలో విడుదలైన మ్యాస్ట్రో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 11: పార్కులో విశ్వతో అమూల్య, చూసేసిన రామరాజు పెద్దకొడుకు
Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు