నితిన్ కెరీర్ ఎప్పుడూ ఒడి దుడుకుల ప్రయాణం లాగే సాగుతూ ఉంటుంది. ఒక దశలో నితిన్ కు పదేళ్ల పాటు హిట్స్ లేవు. తిరిగి ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలతో నితిన్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
నితిన్ భార్య సేఫ్ గా లేకపోవడం ఏంటి.. ఏమైంది అని కంగారు పడిపోకండి. ఇదంతా దీపావళి పండుగలో భాగమే. ఇంట్లో నితిన్ అల్లరి ఎక్కువ కావడంతో అతడి భార్య షాలిని సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది.
అందరి సెలెబ్రిటీల లాగే Nithiin, Shalini దంపతులు కూడా గురువారం దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. నితిన్, షాలిని టపాకాయలు కాల్చుతూ కనిపించారు. అయితే దీపావళి సెలెబ్రేషన్స్ లో భాగంగా నితిన్ చిన్న పిల్లాడైపోయాడు. తన భార్య షాలినిని కాసేపు సరదాగా ఆటపట్టించాడు.
చిన్నపిల్లలు Diwaliకి బాణా సంచా కాల్చుకునే తుపాకీతో నితిన్ అల్లరి షురూ చేశాడు. తన భార్య వైపు తుపాకీ గురిపెట్టి టపా టపా అంటూ టపాకాయలు పేల్చుతున్నాడు. ఆ సౌండ్ భరించలేక షాలిని గట్టిగా చెవులు మూసుకుంది. ఈ వీడియోని షాలిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
Also Read: ఎన్టీఆర్ కుడిచేతికి గాయం, సర్జరీ.. ఫ్యాన్స్ లో కంగారు, అసలేం జరిగిందంటే..
ప్రతి ఒక్కరు దీపావళిని సంతోషంగా, సేఫ్ గా జరుపుకోవాలని కోరుకుంటున్నా. కానీ నేను మాత్రం ఇక్కడ సేఫ్ గా లేను అంటూ ఫన్నీగా వీడియోకి కామెంట్ పెట్టింది. షాలిని పోస్ట్ పై దర్శకుడు వెంకీ కుడుముల సరదాగా రిప్లయ్ ఇచ్చాడు. 'నెక్స్ట్ ఒలంపిక్స్ లో మనకు గోల్డ్ గ్యారెంటీ' అని కామెంట్ పెట్టాడు.
షాలిని ఈ వీడియోలో భయపడుతున్నప్పటికీ.. నితిన్ అల్లరి, ఆమె రియాక్షన్ చూస్తుంటే రొమాంటిక్ గా కూడా ఉంది. నితిన్, షాలిని గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్లపాటు సీక్రెట్ గా ప్రేమ వ్యవహారం నడిపిన వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
Also Read:దీపావళికి అనసూయ మరో ట్రీట్.. ఈసారి ప్యూర్ క్లాసీ లుక్ తో అదరగొట్టేసింది
నితిన్ కెరీర్ ఎప్పుడూ ఒడి దుడుకుల ప్రయాణం లాగే సాగుతూ ఉంటుంది. ఒక దశలో నితిన్ కు పదేళ్ల పాటు హిట్స్ లేవు. తిరిగి ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలతో నితిన్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. నితిన్ కి ప్రేమ కథా చిత్రాలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి కానీ.. యాక్షన్ మూవీస్ నిరాశపరుస్తున్నాయి.
నితిన్ ఈ ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించాడు. రంగ్ దే, చెక్, మ్యాస్ట్రో చిత్రాలు విడుదలయ్యాయి. రంగ్ దే చిత్రం పర్వాలేదనిపించింది. కానీ చెక్ నిరాశపరిచింది. ఇక మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై అలరించింది. ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.