షూటింగ్‌ ప్రారంభించిన నితిన్‌ `మ్యాస్ట్రో`.. మళ్లీ ఊపందుకుంటున్న షూటింగ్‌లు..

Published : Jun 14, 2021, 03:04 PM IST
షూటింగ్‌ ప్రారంభించిన నితిన్‌ `మ్యాస్ట్రో`.. మళ్లీ ఊపందుకుంటున్న షూటింగ్‌లు..

సారాంశం

నితిన్‌ నటిస్తున్న `మ్యాస్ట్రో` చిత్ర షూటింగ్‌ని నేడు(సోమవారం) తిరిగి షూటింగ్‌ని ప్రారంభించారు. కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ ఈ సినిమాని చిత్రీకరిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. 

నితిన్‌, తమన్నా, నభా నటేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `మ్యాస్ట్రో`. ఇది హిందీ సినిమా `అంధాధున్‌`కి రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్‌ పతాకంపై ఎన్‌ సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా ఆగిపోయిన షూటింగ్‌లని మళ్లీ ప్రారంభిస్తున్నారు. నేడు(సోమవారం) తిరిగి షూటింగ్‌ని ప్రారంభించారు. కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ ఈ సినిమాని చిత్రీకరిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. 

`ఈ క్రైమ్‌ కామెడీ చిత్రంలో  నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ రోజు హైదరాబాద్‌లో మొదలైంది. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో  సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత షూటింగ్‌లో పాల్గొంటున్న హీరో నితిన్, అలాగే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత చిత్రీకరణను మొదలుపెట్టిన బిగ్ మూవీ కూడా `మ్యాస్ట్రో`నే కావడం విశేషం.

ఇప్పటికే నితిన్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మహతి స్వరసాగర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు నితిన్‌ హిట్‌ మూవీ `భీష్మ`కు మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వరసాగరే. జె యువరాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. వీటితోపాటు `ఆచార్య`, `పుష్ప`, `లైగర్‌` వంటి సినిమాలు షూటింగ్‌కి ప్లాన్‌ చేసుకుంటున్నాయి. అలాగే ఇప్పటికే కొన్ని చిన్న చిత్రాలు సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్‌లు స్టార్ట్ చేసేందుకు మేకర్స్ అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు