Ravi Teja : మాస్ మహా రాజ్ ‘రవితేజ’కు సెలబ్స్ బర్త్ డే విషేస్.. ఫ్యాన్స్ కు త్రిపుల్ ట్రీట్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 26, 2022, 11:39 AM ISTUpdated : Jan 26, 2022, 11:43 AM IST
Ravi Teja : మాస్ మహా రాజ్ ‘రవితేజ’కు సెలబ్స్ బర్త్ డే విషేస్.. ఫ్యాన్స్ కు త్రిపుల్ ట్రీట్..

సారాంశం

మాస్ మహా రాజ బర్త్ డే సందర్భంగా ఇటు ఫ్యాన్స్, అటు సినీ ప్రముఖులు, పలువురు సెలబ్రెటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రవితేజతో తమకున్న స్నేహాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు.  

గణతంత్ర దినోత్సవం రోజునే పుట్టిన మాస్ మహారాజ 54వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ 1968 జనవరి 26న జన్మించారు. తన సినీ కేరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మొక్కవోని దీక్ష లాగా తన గమ్యం వైపే అడుగులేశారు. ఫలితంగా టాలీవుడ్ లో ‘మాస్’ అనే మాట వినిపిస్తే ముందుగా గుర్తుకు వచ్చే పేరు రవితేజదే.. 

అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ సంపత్ నంది శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ ఖాతాలో రవితేజతో కలిసి తీసిన ‘బెంగాల్ టైగర్’ మూవీ పోస్టర్ ను పోస్ట్ చేశాడు.  అలాగే ‘రాజా ది గ్రేట్’ మూవీతో మాస్ మహా రాజాను విభిన్న పాత్రలో చూపించిన డైరెక్టర్ ‘అనిల్ రావిపూడి’ కూడా బర్త్ డే విషేస్ తెలియజేశారు. తన సినిమా ఫంక్షన్ అప్పుడు రవితేజతో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘మీరేప్పుడు మాస్ మహారాజ’ లాగే ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

 

అలాగే ‘క్రాక్’ మూవీకి అదిరిపోయే మ్యూజిక్ అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ‘ఎస్ థమన్’ కూడా రవితేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో బలుపు, పవర్, మిరపకాయ్  మూవీలకు కూడా మంచి మ్యూజిక్ అందించారు థమన్.    అదేవిధంగా  కోరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా తన బెస్ట్ విషేస్ తెలియజేశారు. ఈ సందర్భంగా రవితేజతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇంకా మరికొందరు సెలబ్స్ తమ బెస్ట్ విషేశ్ తెలియజేశారు. 

కాగా, తన బర్త్ డే సందర్భంగా రవితేజ ఫ్యాన్స్ కోసం త్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన నటిస్తున్న ఖిలాడి, రామరావు ఆన్ డ్యూటీ, ధమాఖ మూవీల నుంచి ఈ రోజే అప్డేట్ ఇవ్వనున్నారు.  ఇఫపటికే ఖిలాడి నుంచి విడుదలైన టైటిల్  సాంగ్స్, పోస్టర్స్, టీజర్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకోకున్నాయి. ఇక ఆయన బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఎలాంటి అప్డేట్ వస్తుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి